ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UTF: ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడొద్దు!

ABN, Publish Date - May 06 , 2025 | 04:04 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎ.వెంకట్‌ ఈ మేరకు సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించారు.

  • తమకు రావాల్సిన, దాచుకున్న డబ్బే అడుగుతున్నారు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు విచారకరం

  • తక్షణమే ఉద్యోగుల ఐకాసతో భేటీ కావాలి: యూటీఎఫ్‌

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘ఉద్యోగులు బోన్‌సలు అడగడం లేదు. సంక్షేమ పథకాలను నిలిపివేసి, జీతాలు పెంచమనీ అడగడం లేదు. న్యాయంగా రావాల్సిన డీఏలు ప్రకటించాలని, దాచుకున్న జీపీఎఫ్‌ నగదును అవసరాలకు ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నారు’ అని యూటీఎఫ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎ.వెంకట్‌ ఈ మేరకు సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వారికి రావాల్సిన నగదు ప్రయోజనాల కోసం 14 నెలలుగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇలాంటివి ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కరిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాట మార్చి ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేయడం విచారకరమని పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి హోదాలో ఉండి చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప కుటుంబం అంటూనే ఉద్యోగులను బజార్న పడేయడం సమంజసం కాదని తెలిపారు. అక్టోబరు 24న ఐకాస ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. మూడు గంటల పాటు ఉద్యోగుల సమస్యలను ఓపిగ్గా విన్నారని గుర్తుచేశారు. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామని చెప్పారన్నారు. ఆర్నెల్లు గడిచినా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించలేదని తెలిపారు. ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వెంటనే క్యాబినెట్‌ సబ్‌ కమిటీ లేదా ముఖ్యమంత్రి.. ఐకాస ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:04 AM