ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Land Fraud: డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట!

ABN, Publish Date - Apr 28 , 2025 | 04:39 AM

రాష్ట్రంలో డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయనున్నారు. రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి ఒక ప్లాట్‌ను విక్రయించిన తర్వాత, అదే వ్యక్తి అదే ప్లాట్‌ను మరొకరికి విక్రయించడం కుదరదు.

సెక్షన్‌ 22-బి ద్వారా సబ్‌రిజిస్ట్రార్లకు వీటిని అడ్డుకునే అధికారాలు

  • రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లో సవరణలకు సిద్ధమైన సర్కారు

  • రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి, కేంద్రానికి..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయనున్నారు. రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి ఒక ప్లాట్‌ను విక్రయించిన తర్వాత, అదే వ్యక్తి అదే ప్లాట్‌ను మరొకరికి విక్రయించడం కుదరదు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ మోసాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 1908 నాటి రిజిస్ట్రేషన్‌ చట్టంలో సవరణలు చేయ డం ద్వారా డబుల్‌ రిజిస్ట్రేషన్లను నియంత్రించాలని నిర్ణయించింది. అనధికారిక లేఅవుట్లు, ఓపెన్‌ ప్లాట్ల లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. నకిలీ పత్రాల ద్వారా మోసపూరిత రిజిస్ట్రేషన్లకు పాల్పడే వ్యక్తుల వల్ల కొనుగోలుదారులు తీవ్రం గా నష్టపోతున్నారు. మోసపోయినట్లు తెలుసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటే కోర్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్‌ జరిగాక.. దాన్ని రద్దు చేసే అధికారం సబ్‌రిజిస్ట్రార్‌కు ఉండదు. ఈ క్రమంలో డబుల్‌ రిజిస్ట్రేషన్లను నిలువరించే అధికారాలను సబ్‌ రిజిస్ట్రార్లకు కట్టబెట్టేలా సెక్షన్‌ 22-బి అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్కారు సిద్ధమైంది.


ఏటా 60 వరకు డబుల్‌ రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో 2024 లెక్కల ప్రకారం 1.53 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఓపెన్‌ ప్లాట్ల అమ్మకాల విషయంలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఇటీవల కాలంలో రెరా అథారిటీకి పిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు డబ్బు చెల్లించిన కొనుగోలుదారుకు దక్కాల్సిన ప్లాట్‌ను మరో వ్యక్తికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసిన ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు చెల్లించి మోసపోయిన వారు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలుదారుల హక్కులకు మరింత భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చట్టంలో సవరణలకు ప్రతిపాదించింది. సెక్షన్‌ 22-బి ద్వారా ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ముందు తప్పనిసరిగా ఈసీని పరిశీలించడం ద్వారా అప్పటికే ఒక వ్యక్తికి విక్రయించిన ప్లాట్‌ మరో వ్యక్తికి విక్రయించకుండా అడ్డుకునే అధికారం కల్పిస్తున్నారు. ఒకవేళ నకిలీ పత్రాలతో మోసపూరిత రిజిస్ట్రేషన్‌కు పాల్పడితే ఈ చట్ట సవరణ ద్వారా దాన్ని రద్దు చేసే అధికారాన్ని కూడా సబ్‌ రిజిస్ట్రార్లకు కల్పిస్తారు. ఇప్పటికే రెండు దశాబ్దాల క్రితం 22 ఏ సెక్షన్‌ ద్వారా ప్రభుత్వ భూములను రక్షించేందుకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేసిన రిజిస్ట్రేషన్‌ శాఖ.. 22-బి ద్వారా డబుల్‌ రిజిస్ట్రేషన్లను నిలువరించేందుకు సన్నద్ధమవుతోంది. చట్టంలో సవరణలు చేసి, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించనున్నారు. తర్వాత అనుమతి కోసం కేంద్రానికి పంపనున్నారు. కేంద్ర హోం, న్యాయ శాఖల పరిశీలన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో సవరణలకు చట్టబద్ధత రానుంది. 2021లో తమిళనాడు ప్రభు త్వం డబుల్‌ రిజిస్ట్రేషన్లను అడ్డుకునే అధికారాలను సబ్‌ రిజిస్ట్రార్లకు కట్టబెట్టగా, 2023లో ఏపీ ప్రభుత్వం ఇలాంటి అధికారాలనే కల్పించింది.


ఇతరత్రా మోసాలకు పాల్పడితే..

ఒకరికి బదులు మరో వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయ డం, రికార్డుల్లో రాసిన సర్వే నంబరు ఒకటి ఉంటే.. భౌతికంగా భూమి వేరే చోట చూపడం, తల్లిదండ్రులు ఎప్పుడో విక్రయించిన తర్వాత వారసులు అడ్డం తిరగడం, హద్దులు మార్చి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. ఇలా పలు రకాల మోసాలతో నిత్యం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏదో ఒకచోట వివాదాలు తలెత్తుతుంటాయి. ప్రస్తుతానికి డబుల్‌ రిజిస్ట్రేషన్లను కట్టడి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. దశల వారీగా అన్ని రకాల మోసాలను అరికట్టేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:39 AM