ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల్లో సవరణ

ABN, Publish Date - May 16 , 2025 | 03:18 AM

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2020లో ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల్లో మరికొన్ని సడలింపులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2020లో ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల్లో మరికొన్ని సడలింపులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణకు రిజిస్టర్‌ సేల్‌డీడ్‌ ఉన్న వారికే అవకాశం ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం (జీవో 98) రిజిస్టర్‌ గిఫ్ట్‌డీడ్‌, రిజిస్టర్‌ ఎక్సేంజ్‌ డీడ్‌, వారసత్వ (సక్సెసన్‌) రిజిస్ర్టేషన్లున్న వారూ తమ ప్లాట్లను క్రమద్ధీకరించుకోవచ్చు. ఈ మేరకు వారికి అవకాశం కల్పిస్తూ పురపాలకశాఖ మెట్రోపాలిటిన్‌ కార్యదర్శి డాక్టర్‌ కె.ఇలంబర్తి గురువారం ఉత్తర్వులిచ్చారు.


ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని లేఅవుట్లలో చేతులు మారిన ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్లు కూడా ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అనధికారిక లేఅవుట్లలో కొనుగోలు చేసినవారికి, వారసత్వంగా స్థలాలు పొందిన వారికి, గిప్ట్‌ద్వారా స్థలాలు స్వీకరించిన వారికి కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధి చేకూరనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:18 AM