ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heatwave: వడదెబ్బతో నలుగురి మృత్యువాత

ABN, Publish Date - May 16 , 2025 | 04:01 AM

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో గురువారం నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు ఖమ్మం జిల్లా వారే.

  • మృతుల్లో ముగ్గురు ఖమ్మం జిల్లా వారే..

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో గురువారం నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు ఖమ్మం జిల్లా వారే. ఖమ్మం శుక్రవారిపేట కాలనీలోని కూరగాయల వ్యాపారి ఎస్‌కే రఫీ బాబు (44), మామిళ్లగూడేనికి వెళ్లే దారిలో బ్రిడ్జి పక్కన ఓ గుర్తు తెలియని వృద్ధుడు, తిరుమలాయపాలెం మం డలం జల్లేపల్లిలో వృద్ధురాలు ఇండ్ల రాజమ్మ (58) వడదెబ్బతో అస్వస్థతకు గురై మరణించారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తిలో ఉపాధి కూలీ ఎర్ర సుధాకర్‌ (54)కు పని ప్రదేశంలో ఎండదెబ్బ తగిలి కుప్పకూలాడు. ప్రాథమిక చికి త్స అందించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో అక్కడక్కడ కురిసిన వానలతో కొన్నిచోట్ల కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది.


గోల్కొండలో అత్యధికంగా 3 సెంమీ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులతో కురిసిన వర్షంతో సంగారెడ్డి, హత్నూర, చౌటకూర్‌ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. కొండాపూర్‌ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే చింతా ప్ర భాకర్‌ పరిశీలించారు. జిన్నారంలో కొనుగోలు కేంద్రంతోపాటు రోడ్లపై ఆరబోసిన దాన్యం తడిసిపోయింది. జోగిపేట మార్కె ట్‌ యార్డులో వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. మెదక్‌ జిల్లా రేగోడు, అల్లాదుర్గం, పాపన్నపేట, చిల్‌పచెడ్‌, వెల్దుర్తి తదితర మండలాల్లో తెల్లవారు జామునే భారీ వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లోనూ రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 04:01 AM