ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RGUKT: ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ABN, Publish Date - May 29 , 2025 | 03:42 AM

రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.

  • ఈ నెల 31వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • ఈ ఏడాది మహబూబ్‌నగర్‌లో కొత్త క్యాంపస్‌

బాసర / హైదరాబాద్‌ మే 28 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు బుధవారం బాసర క్యాంపస్‌ వైస్‌ చాన్స్‌లర్‌ గోవర్దన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గ్రామీణ విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా బాసర క్యాంప్‌సలో 1500 మందికి, మహబూబ్‌నగర్‌ క్యాంప్‌సలో 180 మంది విద్యార్థులకు అధికారులు ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 31 నుంచి జూన్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.టజఠజ్టు.్చఛి.జీుఽ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.


మహబూబ్‌నగర్‌లో ఆర్జీయూకేటీ కొత్త క్యాంపస్‌

బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)ఆధ్వర్యంలో ట్రిపుల్‌ ఐటీ రెండో క్యాంపస్‌ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక భవనంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. బాసర క్యాంప్‌సలో ఏడు ఇంజనీరింగ్‌ కోర్సులు అందుబాటులో ఉండగా.. ఈ క్యాంప్‌సలో కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అమూడు కోర్సులను బోధించనున్నారు.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 03:00 PM