Share News

Central Government: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..

ABN , Publish Date - May 28 , 2025 | 03:25 PM

Central Government: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌కు వరి మద్దతు ధరను 69 రూపాయలకు పెంచింది.

Central Government: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..
Central Government

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌కు వరి మద్దతు ధరను 69 రూపాయలకు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర 2,369 రూపాయలకు చేరింది. కేంద్రం MSP కోసం 2.70 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాదు.. రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్ల రూపాయలు కేటాయించింది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది.


2025-26 ఖరీఫ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వాటి వివరాలు

  • జొన్నలు క్వింటాకు రూ. 328 పెంపు

  • సజ్జలు క్వింటాకు రూ.150 పెంపు

  • రాగులు క్వింటాకు రూ.596 పెంపు

  • మొక్కజొన్న క్వింటాకు రూ.175 పెంపు

  • కందిపప్పు క్వింటాకు రూ.450 పెంపు

  • పెసర్లు క్వింటాకు రూ.86పెంపు

  • మినుములు క్వింటాకు రూ.400 పెంపు

  • వేరుశనగ క్వింటాకు రూ.480 పెంపు

  • పొద్దుతిరుగు క్వింటాకు రూ.441 పెంపు

  • సోయాబీన్ క్వింటాకు రూ.436 పెంపు

  • కుసుములు క్వింటాకు రూ.579 పెంపు

  • ఒలిసెలు క్వింటాకు రూ.820 పెంపు

  • పత్తి క్వింటాకు రూ.589 పెంపు


4 లైన్ల రహదారి విస్తరణకు ఆమోదం

కేంద్ర కేబినేట్ రోడ్లు, రైల్ లైన్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. బద్వేల్‌-నెల్లూరు నాలుగు లైన్ల రహదారి విస్తరణకు ఆమోదం తెలిపింది. 3,653 కోట్ల రూపాయలతో బద్వేల్‌-నెల్లూరు నాలుగు లైన్ల రహదారి విస్తరణ చేపట్టనుంది. వార్దా-బల్లార్షా నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. వీటితో పాటు రత్లాం-వార్దా మధ్య రైల్వే లైన్‌కు ఆమోదం తెలిపింది.


ఇవి కూడా చదవండి

రైతుల ఖాతాల్లో నిధులు జమ.. చెక్ చేసుకున్నారా..!

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Updated Date - May 28 , 2025 | 05:09 PM