Share News

Farmers: రైతుల ఖాతాల్లో నిధులు జమ.. చెక్ చేసుకున్నారా..!

ABN , Publish Date - May 28 , 2025 | 03:37 PM

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది. రైతులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంట నష్ట పరిహారం నిధులను బుధవారం నాడు..

Farmers: రైతుల ఖాతాల్లో నిధులు జమ.. చెక్ చేసుకున్నారా..!
Telangana Government

హైదరాబాద్, మే 28: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది. రైతులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంట నష్ట పరిహారం నిధులను బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల వడగంట్ల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లోని 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక ప్రచారం ప్రభుత్వం రూ. 51.52 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మే నెలకు పంట నష్టపరిహారం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 28 , 2025 | 03:37 PM