Share News

Viral Video: రైల్వే శాఖకే షాకిచ్చాడు.. రైలు పట్టాల మీద జేసీబీని ఎలా నడిపించాడో చూడండి..

ABN , Publish Date - May 28 , 2025 | 03:29 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొందరు చేసే విచిత్రమైన పనులు చాలా మందిని అబ్బురపరుస్తున్నాయి.

Viral Video: రైల్వే శాఖకే షాకిచ్చాడు.. రైలు పట్టాల మీద జేసీబీని ఎలా నడిపించాడో చూడండి..
JSB on Railway Track

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొందరు చేసే విచిత్రమైన పనులు చాలా మందిని అబ్బురపరుస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట హల్‌‌చల్ చేశాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి రైలు పట్టాల (Railway Track) మీద జేసీబీ (JCB)ని నడిపించడం చూడొచ్చు.


@RealTofanOjha అనే ట్విటర్ హ్యాండిల్‌‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రైలు ఆగి ఉంది. దానిలో ప్రయాణికులు కిందకు దిగారు. అదే సమయంలో పక్కనే ఉన్న రైలు పట్టాల మీద నుంచి జేసీబీ వెళ్తోంది. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి వీడియో తీసి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రైలు పట్టాల మీద ఎలాంటి ఇబ్బందీ లేకుండా జేసీబీ వెళ్తుండడం చూసి అందరూ షాకవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 6.6 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోలను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. మొత్తం రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వ్యక్తికి అవార్డు ఇవ్వడానికి వెతుకుతోందని ఒకరు కామెంట్ చేశారు. ఇతడిని చూసి రైల్వే శాఖ కూడా ఆశ్చర్యపోతోంది. రైల్వే పట్టాలకు సరిగ్గా ఆ జేసీబీ చక్రాలు సరిపోవడం ఆశ్చర్యకరం అని ఇంకొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి


అనకొండలతో నిండిపోయిన ఆ నదిని చూశారా.. అసలు సంగతేంటంటే


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 28 , 2025 | 04:49 PM