ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Trafficking: మాయమాటలు చెప్పి అక్రమ రవాణా.. ఏజెన్సీ మహిళలే టార్గెట్‌గా..

ABN, Publish Date - Jun 18 , 2025 | 06:44 PM

ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలను టార్గెట్ చేసిన ముఠా.. వారికి మాయమటలు చెప్పి, ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వారితో ఈ ముఠా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది.

మహిళలపై రోజు రోజుకూ దాడులు పెరగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు ఏదో రకంగా మోసపోవడం చూస్తూనే ఉన్నాం. ఇక ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా, తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలను టార్గెట్ చేసుకున్న మోసగాళ్లు.. వారికి మాయమాటలు చెప్పి ఉత్తారాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పోలీసుల అరెస్ట్‌తో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణ (Telangana) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలను టార్గెట్ చేసిన ముఠా.. వారికి మాయమటలు చెప్పి, ఇక్కడి నుంచి (Women Trafficking) ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ ఈ ముఠా వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది. వ్యభిచార గృహం నుంచి కొందరు మహిళలు తప్పించుకుని స్వగ్రామానికి వచ్చారు.

బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడిన ముఠాకు సంబంధించి మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆసిఫాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

సిట్ దూకుడు.. బాధితుల వాంగ్మూలం రికార్డ్

నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 06:44 PM