Share News

Phone Tapping Victims: సిట్ దూకుడు.. బాధితుల వాంగ్మూలం రికార్డ్

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:55 AM

Phone Tapping Victims: టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ అధికారుల నుంచి తన ఫోన్ ట్యాప్ అయినట్టు సమాచారం వచ్చిందని జైపాల్ రెడ్డి తెలిపారు.

Phone Tapping Victims: సిట్ దూకుడు.. బాధితుల వాంగ్మూలం రికార్డ్
Phone Tapping Victims

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ అధికారులు (SIT Officers) దూకుడు పెంచారు. ఈ కేసులో దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన బాధితులకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్‌ సిట్ కార్యాలయానికి ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు. బాధితుల నుంచి వాంగ్మూలాన్ని సేకరిస్తోంది సిట్. ఇందులో భాగంగా ఈరోజు (బుధవారం) టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి (TPCC official spokesperson Mungi Jaipal Reddy) వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ కార్యాలయానికి వచ్చారు.


సిట్ అధికారుల నుంచి తన ఫోన్ ట్యాప్ అయినట్టు సమాచారం వచ్చిందని జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. జైపాల్ నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది సిట్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కరోజే 600 మంది ఫోన్లు ఒకేసారి ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఫోన్లు ట్యాప్ అయిన వారిని బాధితులుగా గుర్తించి వారికి సమాచారం ఇస్తున్నారు సిట్ అధికారులు. ఈకేసులో సాక్షులుగా వారిచ్చే వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా పెద్ద మొత్తంలో బాధితుల నుంచి వాంగ్మూలాన్ని సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు కూడా మరికొంత మంది బాధితులు సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలాన్ని ఇస్తున్నారు.


మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును మరోసారి విచారించాలని సిట్ భావించింది. నిన్న ప్రభాకర్‌ రావు విచారణ జరగాల్సి ఉంది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి సాక్షిగా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉండటంతో ప్రభాకర్ రావు విచారణను రేపటికి వాయిదా పడింది. ఇక కొద్ది సేపటి క్రితమే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రణీత రావు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లను తీసుకుని ప్రణీత్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు ప్రణీత్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు మరోసారి ఆయనను సిట్ విచారిస్తోంది.


ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడం ఎంతో కీలకంగా మారింది. దీంతో ఎవరు హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేశారు.. హార్డ్ డిస్క్‌ మాయం చేయడంలో ఎవరి పాత్ర ఉంది అనే సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభాకర్‌రావు నుంచి సరైన సమాధానం రాని పరిస్థితి. ఈ క్రమంలో ఈ విషయంపై నేడు ప్రణీత్ రావును విచారించాలని సిట్ పోలీసులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం

మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్

ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 12:17 PM