MLA: దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి..
ABN, Publish Date - May 14 , 2025 | 01:01 PM
దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి.. అంటూ మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆమె విమర్శించారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabitha Reddy) అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పహాడిషరీఫ్‌లోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 380 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: KTR Slams Rahul: రాహుల్.. మీకు ఆ కంపెనీతో రహస్య ఒప్పందం ఉందా
ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇవాళ ఆ హామీలను పూర్తిగా విస్మరించి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. ఇప్పటికీ ప్రజల్లో వెళ్లే ధైర్యంలేక లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తోందన్నారు. దమ్ముంటే వెంటనే ఎన్నికలు పెట్టాలని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు.
కార్యక్రమంలో బాలాపూర్ మండల తహసీల్దార్ ఇందిరాదేవి, జలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రామ్ రామ్, మాజీ కౌన్సిలర్లు, షేక్ ఆఫ్జాల్, మాజీ చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, పల్లపు శంకర్, హాసన్ షా, బీఆర్‌ఎస్ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు
కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు
ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?
నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!
దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!
Read Latest Telangana News and National News
Updated Date - May 14 , 2025 | 01:01 PM