KTR Slams Rahul: రాహుల్.. మీకు ఆ కంపెనీతో రహస్య ఒప్పందం ఉందా
ABN , Publish Date - May 14 , 2025 | 12:26 PM
KTR Slams Rahul: వరంగల్‌లో ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలననా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మే 14: రేవంత్ సర్కార్‌పై (Revanth Govt) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) మరోసారి విరుచుకుపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం పేదల ఇళ్లు కూల్చుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ విధానంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. వరంగల్‌లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలననా అంటూ ఫైర్ అయ్యారు.
వరంగల్‌లో దారి వెంట ఇళ్ల ధ్వంసంపై కేటీఆర్ మండిపడ్డారు. కూల్చివేతలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్.. దీనికి సంబంధించి రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హలో రాహుల్ గాంధీ, బుల్డోజర్ కంపెనీలతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉన్నదా. ప్రతిరోజూ పేదల ఇళ్లతో పాటు వారి జీవితాలపై దాడి చేయడం ఏమిటి. అందాల పోటీల కోసం పేదవారి ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలననా. రూ.200 కోట్ల ప్రజా సొమ్ము ఖర్చుపెట్టి రాజభవనాల్లో విందులు పెట్టడం ప్రజాపాలనా. పేద ప్రజల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయి. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
AP Liquor Scam: గోవిందప్పను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. అంతలోనే
CAIT Letter To Piyush Goyal: ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారాలపై పాక్ జెండాలు.. సీఏఐటీ అభ్యంతరం
Read Latest Telangana News And Telugu News