ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miss Thailand: క్యాన్సర్‌ బాధితులకు అండగా..

ABN, Publish Date - May 06 , 2025 | 04:23 AM

అందానికి ఎంతో మంది ఎన్నో రకాల నిర్వచనాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ, నిజమైన అందం మనసులోనే ఉంటుందనేది కొంతమంది భావన.

  • అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిస్‌ థాయ్‌లాండ్‌ ఓపల్‌ సుచాతా

  • రాజధానిలో సందడి.. ముత్యాలంటే ప్రేమ

హైదరాబాద్‌ సిటీ, మే 5 (ఆంధ్రజ్యోతి): అందానికి ఎంతో మంది ఎన్నో రకాల నిర్వచనాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ, నిజమైన అందం మనసులోనే ఉంటుందనేది కొంతమంది భావన. ఇప్పుడు ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అందగత్తెలలో మిస్‌ థాయ్‌లాండ్‌ ఓపల్‌ సుచాతా గురించి తెలిస్తే.. అది నిజమని అంగీకరించక తప్పదు. ఆదివారమే నగరానికి వచ్చిన ఆమె, సోమవారం బంజారాహిల్స్‌లోని సింఘానియాస్‌ స్టోర్‌లో సందడి చేశారు. అంతర్జాతీయంగా పేరొందిన జ్యువెలర్‌ కలెక్టివ్‌ సంస్ధతో కలిసి నగరంలోని చార్మినార్‌ సహా పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమె చాలా అంశాలపై మాట్లాడారు. అందులో ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..


మాదీ ముత్యాల నగరమే...

హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. కానీ.. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే.. నేను పుట్టిన పుకెట్‌కు, హైదరాబాద్‌కు ఒక సంబంధం ఉంది. అదేంటంటే.. హైదరాబాద్‌లాగానే మాదీ ముత్యాల నగరి. బ్యాంకాక్‌లో హైస్కూల్‌ విద్య అభ్యసిస్తున్నప్పుడే నా దృష్టి అందాల పోటీలపై పడింది. అయితే, ఆ పోటీల్లో పాల్గొంటూనే చదువునూ కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం నేను రాజనీతి శాస్త్రం చదువుతున్నాను. నాకు ఆ సబ్జెక్ట్‌ అంటే ఇష్టం. ఒకవేళ నేను మోడలింగ్‌ రంగంలోకి రాకపోతే రాజకీయ రంగంలో ఉండే దాన్ని. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన విభాగంలో పనిచేసేదాన్ని. భవిష్యత్‌లో మా దేశ రాయబారిగా ఉండాలన్నది నా కోరిక.


అవగాహనతోనే..

‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ పేరుతో నేను థాయ్‌లాండ్‌లో జాతీయస్థాయిలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. దీనికి ఒక కారణం ఉంది. నా పదహారేళ్ల వయసులో రొమ్ము భాగంలో ఒక కణితి ఏర్పడింది. వైద్యులు దాన్ని శస్త్రచికిత్స ద్వారా తీసేశారు. అది నా జీవితంలోనే అత్యంత సంక్లిష్టమైన దశ. ఆ దశను విజయవంతంగా అధిగమించాలని నాకు నేనే వాగ్దానం చేసుకున్నాను. ఎంతో ప్రయత్నించి దాన్నుంచి బయటపడ్డాను. ఆ సమయంలోనే నాకు రొమ్ము క్యాన్సర్‌ బాధితుల గురించి, వారి సమస్యల గురించి తెలిసింది. నిజానికి.. ముందుగా గుర్తిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. అందుకే.. రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, తొలిదశల్లోనే దాన్ని గుర్తించేలా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాను. ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాలన్నదే నా లక్ష్యం. నా జీవితం థాయ్‌లాండ్‌లో ఎంతోమందికి స్ఫూర్తి కలిగించింది. క్యాన్సర్‌ రోగులు కొంతమంది ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధిస్తే, కొంతమంది దురదృష్టవశాత్తు ఈ పోరాటంలో ఓడిపోయారు.


తెలంగాణా ఆతిథ్యం అపూర్వం..

ప్రపంచ సుందరి పోటీలకు ఇక్కడి ప్రభుత్వ సహకారం, మద్దతు, తెలంగాణ ఆతిథ్యం అపూర్వం. నిన్న విమానాశ్రయంలో దిగగానే.. ఎంతోమంది వచ్చి నన్ను ఆహ్వానించడం, మద్దతు పలకడం.. చాలా సంతోషంగా అనిపించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. నేను ఆభరణాలకు పెద్ద అభిమానిని. అందునా ముత్యాలంటే చాలా ఇష్టం. అందుకే.. హైదరాబాద్‌ ముత్యాలను కొనాలనుకుంటున్నాను. ఒకవేళ నేను మిస్‌వరల్డ్‌ టైటిల్‌ గెలిస్తే.. మా దేశం ఆ కిరీటాన్ని అందుకోవడం ఇదే తొలిసారి అవుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:23 AM