Kaleshwaram Project: 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:20 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11వ తేదీన హాజరు కానున్నారు.
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11వ తేదీన హాజరు కానున్నారు. మొదట ఆయనను ఈ నెల 5న విచారణకు రావాలని కమిషన్ కోరింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసిన కేసీఆర్, వ్యక్తిగత పనుల కారణంగా 5న హాజరు కాలేనని చెప్పారు.
11కి మారిస్తే రాగలనన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని మార్చింది. మాజీ మంత్రి హరీశ్‌రావు మాత్రం కమిషన్ నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం ఈ నెల 9నేకమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 04:20 AM