Bakery: బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:58 PM
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. కొప్పల్ జిల్లాలో ఓ వ్యక్తిని వేటాడి మరీ దారుణంగా నరికి చంపారు. ఈ హత్య జరిగే ముందు సదరు వ్యక్తి ప్రాణ భయంతో బేకరిలోకి పరుగులు తీశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమైనాయి.
బెంగళూరు, జూన్ 02: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. ఓ వ్యక్తిని కత్తులు, కొడవళ్లతో నరికి అతి దారుణంగా హత్య చేశారు. హత్యకు గురయ్యే ముందు సదరు వ్యక్తి.. తన ప్రాణాలు రక్షించుకునేందుకు భయంతో బేకరీలోకి పరుగు తీశాడు. అయినా అతడిని వదల్లేదు. పలువురు వ్యక్తులు అతడిని వేటాడి వెంటాడి.. కర్రలు, కత్తులు, కొడవళ్లతో దాడి చేశారు. ఆ క్రమంలో బేకరీ నుంచి అతడు బయటకు పరుగుతీసే ప్రయత్నం చేశాడు. అతడిని అక్కడే చుట్టిముట్టి వేట కొడవళ్లతో అత్యంత దారుణంగా నరికి చంపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు బేకరీలోని సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో మే 31వ తేదీన చోటు చేసుకుంది.
ఈ హత్య ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్య ఘటనపై స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. అందులో భాగంగా బేకరీలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను పోలీసులు గుర్తించారు.
ఇక మృతుడు పేరు చెన్నప్ప నారినల్‌గా పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి రవి, ప్రదీప్, మంజునాథ, నాగరాజు, మంజునాథ, గౌతమ్, ప్రమోద్ అనే ఏడుగురిని అరెస్ట్ చేశామన్నారు. పాత కక్షలతోపాటు ఆస్తి తగాదా కారణంగానే ఈ హత్య జరిగిందని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు స్పష్టం చేశారు. చెన్నప్ప నారినల్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం పోలీసులను డిమాండ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వడంపై కేసీఆర్ కీలక నిర్ణయం
వారిపై భౌతిక దాడులు చేస్తే ఊరుకోం.. రఘునందన్‌రావు మాస్ వార్నింగ్
For National News And Telugu News