ప్రస్తుతం చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల తలపై దురద, చికాకు కలుగుతుంది. చాలా రకాల షాంపులు వాడినా ఈ సమస్య తగ్గదు. వైద్యులు సూచించిన మందులకు సైతం ఈ సమస్య తగ్గదు.
సహజమైన చిట్కాలతో ఈ సమస్యను దూరం చేయవచ్చు.
కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి తలకు మసాజ్ చేయాలి. తలస్నానం చేయడానికి ముందు 20 నిమిషాలు అలా ఉంచాలి. వారానికి రెండు సార్లు చొప్పున కొన్ని వారాలు ఇలా చేస్తే.. చుండ్రు సమస్య దూరం అవుతుంది.
తాజా అలోవెరా జెల్‌ను నేరుగా తలకు రాయాలి. దానిని అర గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రు సమస్య ఉండదు.
ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన మోతాదులో కలిపి షాంపూ చేసిన తర్వాత తలకు రాయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత తల స్నానం చేయాలి.
మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్ని పేస్ట్‌లా తయారు చేసుకుని, తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దురద, పొట్టు తగ్గుతుంది.
వాడే షాంపులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. వీటిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును సహజంగా చికిత్స చేయడానికి, అలాగే తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి.