పండ్ల రాణి గురించి మీకు తెలుసా?

పండ్లలో మామిడిని రాజు అని పిలుస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.

మాంగోస్టీన్ లేదా వంగమామిడిని "పండ్ల రాణి" అని పిలుస్తారు.

మాంగోస్టీన్ సాధారణంగా థాయిలాండ్, మలేషియా, సింగపూర్‌లలో కనిపిస్తుంది.

ఇది థాయిలాండ్ జాతీయ పండు. దీని శాస్త్రీయ నామం గార్సినియా మాంగోస్తానా.

పండ్లలో రాణి అయిన మాంగోస్టీన్, రుచి, నాణ్యత పరంగా మామిడి లాగే ప్రత్యేకమైనది.

మాంగోస్టీన్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది.

జలుబు, దగ్గును తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది.