ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Recruitment: కొలువులో చేరేదెప్పుడు?

ABN, Publish Date - May 08 , 2025 | 04:09 AM

నీటిపారుదల శాఖ లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత కార్యక్రమం మరోసారి వాయిదాపడింది.

  • నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు పొందిన వందలాది మంది అభ్యర్థుల్లో నిరాశ

  • నియామక పత్రాలు అందజేత మళ్లీ వాయిదా

  • ఏప్రిల్‌ 28 నుంచి ఇలా ఐదోసారి..

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత కార్యక్రమం మరోసారి వాయిదాపడింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు పత్రాలు అందజేయనున్నట్లు అభ్యర్థులకు సమాచారమిచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు జలసౌధకు తరలివచ్చారు. అయితే పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై మనదేశం ఎయిర్‌ స్ట్రయిక్స్‌ చేయడంతో ఈ కార్యక్రమం వాయిదా పడిందని తెలిసి అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. నీటిపారుదలశాఖలో 224 అసిస్టెంట్‌ ఇంజనీర్లు(ఏఈ)లు, 199 మంది జూనియర్‌ టెక్నికల్‌ అధికారులు(జేటీవో)లుగా ఎంపికైన విషయం విదితమే.


వాస్తవానికి ఏప్రిల్‌ 28వ తేదీన రాజేంద్రనగర్‌లోని వాలంతరిలో సీఎం చేతుల మీదుగా ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందించాలనుకున్నారు. తీరా కార్యక్రమం వాయిదా పడింది. మళ్లీ రెండ్రోజులకు.. అంటే ఏప్రిల్‌ 30న కార్యక్రమం ఉంటుందని ఉద్యోగార్థులకు సమాచారం ఇవ్వగా... ఆ రోజు కూడా అభ్యర్థులు వచ్చి వెళ్లిపోయారు. తాజాగా ఈనెల 2న సీఎం చేతుల మీదుగా కార్యక్రమం ఉంటుందని సమాచారమిచ్చారు. అదీ వాయిదా పడింది. ఆ మర్నాడు.. అంటే 3న ఇవ్వాలని నిర్ణయించినా కార్యక్రమం జరగలేదు. ఇలా 10 రోజుల్లో ఐదుసార్లు కార్యక్రమం వాయిదా పడటం... అభ్యర్థులు వచ్చి వెళ్లిపోతుండటంతో శాఖలోని అధికారుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలా ఇంకెన్నిరోజులు ఇలా తిప్పుకుంటారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:09 AM