Road Accident: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ABN, Publish Date - May 25 , 2025 | 07:21 AM
Road Accident: శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.
హైదరాబాద్: శంషాబాద్ (Shamshabad) వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అదుపుతప్పిన లారీ (Lorry) బోల్తా పడిందని పోలీసులకు (Police) సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
Also Read: భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో చిక్కుకుని అప్పులపాలైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, కొత్లాపూర్‌లో జరిగింది. కోటమర్పల్లికి చెందిన విజయ్ కుమార్ (23) ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని రూ.2 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురై శనివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం కొత్లాపూర్ శివారులో హైదరాబాద్ నుంచి పూర్ణాకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెజవాడ, విశాఖల్లో బాంబు బెదిరింపు కలకలం
For More AP News and Telugu News
Updated Date - May 25 , 2025 | 07:21 AM