Share News

Ration Distribution: జూన్‌లో ఒకేసారి 3నెలల రేషన్‌

ABN , Publish Date - May 25 , 2025 | 05:19 AM

మోన్సూన్‌ నేపథ్యంలో పేదలకు జూన్‌ 1 నుంచి మూడు నెలల ముందస్తు రేషన్‌ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆహార భద్రతా కార్డుదారులకు తలా 6 కిలోలు చొప్పున, ఇతర కార్డుదారులకు అవసరమైన రేషన్‌ను ఉచితంగా ఇవ్వనున్నారు.

Ration Distribution: జూన్‌లో ఒకేసారి 3నెలల రేషన్‌

రేషన్‌ షాపుల్లో ఆ నెలంతా సన్నబియ్యం అందజేత

కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా ముందస్తుగా ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం

వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల ముప్పు కారణంగానే

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): వానకాలంలో భారీ వర్షాలు, వరదలకు అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా పేదలకు మూడునెలల ముందస్తు రేషన్‌ అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్‌ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. జూన్‌, జూలై, ఆగస్టు నెలల కోటా సన్న బియ్యాన్ని రేషన్‌ దుకాణాల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జూన్‌ ఒకటి నుంచి 30వ తేదీలోపు మూడు నెలల రేషన్‌ పంపిణీ పూర్తయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీఎ్‌సలను ఆదేశించారు. ఈసారి మూడు నెలల కాలవ్యవధికి అవసరమైన బియ్యం కేటాయింపులు స్టేజ్‌-1 గోదాముల ద్వారా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేర్చే ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వినియోగదారులకు పంపిణీ జూన్‌ 1వ తేదీ నుంచి 30వ తేదీలోగా పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చౌహాన్‌ స్పష్టం చేశారు.


నిబంధనలకు అనుగుణంగా ప్రజలందరికీ పోర్టిఫైడ్‌ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి నెల ఇచ్చినట్లుగానే ఆహార భద్రతా కార్డు గలిగిన వారికి తలా 6 కిలోల చొప్పున ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని అందజేస్తారని తెలిపారు. ఎఎ్‌ఫఎ్‌ససీ కార్డుదారులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డు దారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ఏఏవై కార్డుదారులకు పంచదార రూ. 13.50కి ఒక కిలో చొప్పున ఇస్తారని తెలిపారు. గోధుమలు కిలో రూ. 7 చొప్పున జీహెచ్‌ఎంసీలో 5 కిలోలు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ-పాస్‌ సాంకేతికత ద్వారా నెలనెలకు వేర్వేరు ఈపీవోఎస్‌ రసీదులు జనరేట్‌ చేయాలని, బయోమెట్రిక్‌ ద్వారా ధ్రువీకరణ కూడా నెలనెలకు వేర్వేరుగా చేయాలని అధికారులను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 05:19 AM