Karnataka Tragedy: భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
ABN , Publish Date - May 25 , 2025 | 05:44 AM
దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకాలో భార్యకు సీమంతం చేస్తుండగా భర్త సతీష్ గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ముందే జరిగిన ఈ సంఘటన కుటుంబంలో విషాదాన్ని పుట్టించింది.

బెంగళూరు, మే 24(ఆంధ్రజ్యోతి): భార్యకు సీమంతం చేస్తుండగా భర్త గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన దక్షిణకన్నడ జిల్లా బంట్వాళ తాలూకా విట్ల సమీపంలోని మిత్తనడ్క గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సతీష్(33) భార్య ఏడు నెలల గర్భిణి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సీమంతం నిర్వహించారు. ఆ సమయంలో సతీష్ గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే మంగళూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా సతీష్ మృతిచెందాడు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..