Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - May 24 , 2025 | 04:26 PM
కేసీఆర్ పరిస్థితి తమిళనాడులో జయలలిత మాదిరిగా తయారైందన్నారు కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందన్నారు. కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్‌కి లేదన్నారు. సొంత మనుషులే కేసీఆర్‌ను వెన్నుపోటు..

హైదరాబాద్, మే 24: బీఆర్ఎస్‌లో కవిత ఎపిసోడ్‌పై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కవిత చెప్పిన దెయ్యాలు వారేనంటూ సంతోష్, కేటీఆర్, హరీష్ రావుల పేర్లను ప్రస్తావించారు. శనివారం నాడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సామ రామ్మోహన్ రెడ్డి.. కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతకు లేఖ రాసిన అంశాన్ని తాను 10 రోజుల ముందే చెప్పానన్నారు. కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు అని వ్యాఖ్యానించారు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసేందుకు స్కెచ్ వేశారని.. త్వరలోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అన్నారు.
సంతోష్ రావును పార్టీ ప్రెసిడెంట్‌గా ప్రకటించే అవకాశం ఉందన్నారు సామ. కేసీఆర్ పరిస్థితి తమిళనాడులో జయలలిత మాదిరిగా తయారైందన్నారు కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందన్నారు. కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్‌కి లేదన్నారు. సొంత మనుషులే కేసీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారన్న సామ.. కుటుంబాన్ని విచ్చిన్నం చేసినా కేసీఆర్ నిస్సహాయుడిగా ఉన్నారని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే గతంలో అనేక మందిపై కేసీఆర్ చర్యలు తీసుకున్న విషయాన్ని సామ గుర్తు చేశారు. మరి కవితపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉందన్నారు.
అంతేకాదు.. కేసీఆర్‌తో కవిత మాట్లాడుతానంటే సంతోష్ అడ్డుకున్నారని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఏం చేయాలో, ఎవరిని కలవాలో సంతోష్ డిసైడ్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ దర్శనానికి ఎమ్మెల్యేల దగ్గర సంతోష్ డబ్బులు తీసుకుంటున్నారని సామ ఆరోపించారు. తండ్రి, బిడ్డల మధ్య ఇంత గ్యాప్ సృష్టించిన ఆ దెయ్యం ఎవరు అని ప్రశ్నించారాయన. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన కేటీఆర్ పార్టీలో జరుగుతున్న వివక్షపై స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇస్తున్న కేటీఆర్ వాళ్ల పార్టీ గురించి ఆలోచించుకోవాలని హితవు చెప్పారు.
Also Read:
శ్రామిక శక్తిలో మహిళల్ని బాగా ప్రోత్సహించండి
ఉగ్రవాదం రాబిడ్ డాగ్, పాక్ దాని హ్యాండ్లర్
For More Telangana News and Telugu News..