ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Jul 09 , 2025 | 03:04 PM

సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిది మంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఎనిమిదిమంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు.

Telangana Government

సంగారెడ్డి: సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిది మంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ (బుధవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాద సమయంలో కాలి బుడిదై ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇప్పటికే వందశాంపిల్స్ సేకరించిన డీఎన్ఏ మ్యాచ్ కాలేదని అధికారులు తెలిపారు. ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. మూడు నెలల తర్వాత తిరిగి రావాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అప్పటి వరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

లెవల్‌ క్రాసింగ్‌ గేట్లపై దృష్టి కేంద్రీకరించాలి

ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 09 , 2025 | 03:12 PM