TG Government: వారికి గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN, Publish Date - Jul 21 , 2025 | 04:34 PM
డయాలసిస్ పేషెంట్లకి రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతనంగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లని మంజూరు చేయనుంది. ఈ మేరకు పెన్షన్ మంజూరు ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు.
హైదరాబాద్: డయాలసిస్ పేషెంట్లకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతనంగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు (Dialysis Patients Pension) తెలంగాణ సర్కార్ (Telangana Government) చేయూత పెన్షన్లని మంజూరు చేయనుంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య మెుత్తం 4,710కి చేరింది. ఈ మేరకు పెన్షన్ మంజూరు ఫైల్‌పై మంత్రి సీతక్క (Minister Seethakka) సంతకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 4,011 మంది డయాలసిస్ పేషెంట్లకు సామాజిక పెన్షన్లని బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4,029 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లని మంజూరు చేశారు. తాజాగా నిర్ణయంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది.
వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం గుర్తిస్తోంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను సెర్ప్ మంజూరు చేయనుంది. 681 మంది డయాలసిస్ పేషెంట్లలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 629 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 52 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరు పూర్తిస్థాయిలో పని చేసుకోలేకపోవడంతో వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఈ మేరకు వారిని గుర్తించిన రేవంత్ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసేందుకు సన్నద్ధం అయ్యింది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్‌దారులు పెన్షన్ అందుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 21 , 2025 | 07:37 PM