ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: భారత్-పాక్ యుద్ధం.. తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

ABN, Publish Date - May 09 , 2025 | 03:52 PM

Operation Sindoor: భారత్ - పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి అండగా నిలబడాలని తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.

Operation Sindoor

హైదరాబాద్, మే 9: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. విరాళం ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.


భారత ఆర్మీకి మంచి జరగాలని

మన భారత గడ్డ మీద పర్యాటకులను చంపిన తీవ్రవాదులను ఏరివేతే లక్ష్యంగా దేశ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ టార్గెట్ విజయవంతం అయ్యేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో పూజలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇంతటి సంక్లిష్టమైన సమయంలో భారత ఆర్మీకి అంతా అండగా నిలవాల్సిన సందర్భమన్నారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) రెండో దాడి విజయవంతం అవడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

Operation Sindoor: మీ ఆవేదన తీర్చలేదని.. మురళీనాయక్ ఫ్యామిలికి సీఎం పరామర్శ


మన ఆర్మీ బలగాలు సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాడుతున్న సమయంలో వారి క్షేమం కోరి అంతా పూజలు చేయడం సందర్భోచితమని మంత్రి కొండా సురేఖ అన్నారు. తీవ్రవాదాన్ని యావ‌త్ భార‌త‌మంతా ఉక్కు పిడికిలితో ఎదుర్కొన్న‌దన్నారు. ఈ స‌మైక్య‌త దేశ భద్రత విషయంలో రానున్న రోజుల్లో కూడా ఉంటుందన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ఎక్క‌డ ఉన్నా క‌ఠినంగా వ్య‌వ‌హరించాలని తెలిపారు. మ‌న దేశ పౌరుల మీద ఇటీవ‌ల కాశ్మీర్‌లో జ‌రిగిన దాడికి నిర‌స‌న‌గా ఇండియ‌న్ మిల‌ట‌రీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ అంద‌రూ స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ మంత్రిగా కాదు, ఇంత‌టి గొప్ప దేశ పౌరురాలిగా ఈ చ‌ర్య‌పై చాలా సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు. పుల్వామాలో మనం కోల్పోయిన వీర సైనికులను తిరిగి తీసుకురాలేమని.. వారి త్యాగం శాశ్వతమన్నారు. మ‌న‌మున్నంత కాలం వారిని స్మ‌రించుకుంటామన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తలెత్తి నిలిచిందన్నారు. ఏకత్వంతో, శక్తితో, నిశ్శబ్దమైన సంకల్పంతో మనల్ని ప్రపంచం నిలబెట్టిందని చెప్పుకొచ్చారు. ఇది కేవలం ప్రతిస్పందన కాదని.. ఒక ప్ర‌తి స‌మాధానమని వెల్లడించారు.


అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో చాలా మ‌ర్యాదగా ప్ర‌వ‌ర్తించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. దేశ భ‌ద్ర‌త విష‌యంలో అంద‌రినీ క‌లుపుకుపోవాలని.. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన విష‌యమన్నారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజ‌కీయం చేయాల‌ని అనుకోవ‌డం లేదని... చేయ‌దు కూడా అని స్పష్టం చేశారు. తాము భారత ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉన్నామని.. రానున్న రోజుల్లో కూడా ఉంటామన్నారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గుడిలో, దేవాలయాలో ఆర్మీకి మంచి జరగాలని పూజలు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2025 | 05:00 PM