Minister Thummala: రేషన్ కార్డులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
ABN, Publish Date - Jan 26 , 2025 | 07:05 PM
Minister Thummala Nageshwar Rao: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు.
ఖమ్మం: రేషన్ కార్డు దారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ప్రకటించారు. ఆదివారం నాడు రఘునాథ పాలెం మండలం మల్లెపల్లిలో ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలోనే కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు. 75 ఏళ్లు గణతంత్ర దినోత్సవం పూర్తయిన సందర్భంగా పవిత్రమైన ఈ రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించుకున్నామని అన్నారు. రైతు రుణమాఫీ రూ. 21 వేల కోట్లు మాఫీ చేశామన్నారు.
రైతు భరోసాలో ఎకరాకు రూ. 12 వేలు సాయం అందజేస్తున్నామని అన్నారు. అర్ధరాత్రి నుంచి రైతు అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామన్నామని చెప్పుకొచ్చారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు. లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మార్చి 31 నాటికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు , రేషన్ కార్డులు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కలెక్టర్ తినే సన్న బియ్యం పేదలు తినాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు దక్కేలా పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. రూ. 40 వేల కోట్లు ఏడాదిలో రైతన్నల కోసం ఖర్చు చేసిన ఘనత రేవంత్ సర్కార్‌దేనని చెప్పారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌తో రఘునాథపాలెం మండలం ధనిక మండలంగా మారాలని అన్నారు. ఖమ్మం అర్బన్‌లో ఉండే రఘునాథపాలెంను మండలంగా తానే ఏర్పాటు చేశానని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
యాదాద్రి : రైతు ఆత్మీయ భరోసా పథకం దేశంలో ఎక్కడా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Nalamada) అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నికల సమయంలో రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం యాబై శాతం మంది తినడం లేదని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో పండినంత పంట ఎక్కడ పండలేదన్నారు. పండిన ప్రతి గింజ తాము కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..
Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..
Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jan 26 , 2025 | 07:14 PM