Share News

CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..

ABN , Publish Date - Jan 26 , 2025 | 12:43 PM

పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, వివక్ష కనిపించిందని, ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానమని, 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణకు కనీసం 5 పురస్కారాలు కూడా రాలేదని విమర్శించారు.

CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..
CM Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం అంబేద్కర్‌ వర్సిటీ (Ambedkar University)లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (Skill Development Center).. డిజిటల్‌ రిసోర్స్‌ సెంటర్‌ (Digital Resource Center)కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణపై చర్చ జరగడం దురదృష్టకరమని, అంబేద్కర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇదని.. కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని సీఎం విమర్శించారు. కేంద్రం నూతన యూజీసీ నిబంధనలు మార్చాలని, రాష్ట్రాల హక్కులు గుంజుకోవడం మంచిది కాదని అన్నారు. వీసీలను తమ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం కుట్ర చేసిందన్నారు. తాము వీసీల నియామకంతోనే సరిపెట్టుకోలేదని, వర్సిటీల్లో వీసీ ఖాళీల భర్తీకి ఆదేశించామని చెప్పారు. తెలంగాణ సమాజం తమకు మరో పదేళ్లు అవకాశమిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి..

బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల


కేంద్రం కుట్రలను అడ్డుకుంటాం

పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, వివక్ష కనిపించిందని, ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానమని, 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణకు కనీసం 5 పురస్కారాలు కూడా రాలేదని ఆరోపించారు. పద్మ అవార్డుల విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూతన యూజీసీ నిబంధనలపై పోరాడుతామని, రాష్ట్రాల హక్కులు గుంజుకోవడం మంచిది కాదని, కేంద్రం కుట్రలను అడ్డుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు

కాగా సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్, మంత్రులు, డీజీసీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో త్రివర్ణ పతాకం ఎగరవేత..

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో పరేడ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 26 , 2025 | 12:44 PM