ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు

ABN, Publish Date - May 02 , 2025 | 07:09 AM

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఢిల్లీలో జరిగే ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఆయన జాతీయ నాయకులకు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

CM Revanth Reddy Delhi visit

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం ఢిల్లీ పర్యటనకు (Delhi Visit) వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయల్దేరనున్నారు. సీడబ్ల్యూసీ (CWC) సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. కుల గణనకు (Caste Census) సంబంధించిన విషయాలను సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ముఖ్య నాయకులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహాలు, విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఢిల్లీలో జరిగే ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఆయన జాతీయ నాయకులకు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా దేశ రాజకీయాల్లో కులగణన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: ఆపరేషన్‌ కగార్‌ను కొనసాగించాలి


ఇన్నాళ్లూ కులగణన డిమాండ్‌తో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్‌.. ఇప్పుడు అయోమయంలో పడింది. జనాభా లెక్కల సేకరణతోపాటే కులగణన కూడా జరపాలని మోదీ క్యాబినెట్‌ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీని విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణననే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో అది బీజేపీ చేతికి వెళ్లిందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శుక్రవారం ఢిల్లీలో భేటీకానుంది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. వర్కింగ్‌ కమిటీ కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై విస్తృతంగా చర్చిస్తుందన్నారు. కులగణనను ఆమోదిస్తూ ప్రభుత్వం ‘హెడ్‌లైన్‌’ ఇచ్చిందని.. కానీ దాని అమలుకు డెడ్‌లైన్‌ ఎక్కడని ప్రశ్నించారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై గట్టి చర్య తీసుకోవాలన్న డిమాండ్ల నేపథ్యంలో కులగణనపై నిర్ణయం పక్కదోవ పట్టించే ఎత్తుగడగా అభివర్ణించారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఇందుకోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని సభకు హాజరుకండి

బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై రాష్ట్రాలతో 7న కేంద్రం భేటీ

For More AP News and Telugu News

Updated Date - May 02 , 2025 | 07:09 AM