Krishna Water Dispute: బ్రిజేశ్ ట్రైబ్యునల్ తీర్పుపై రాష్ట్రాలతో 7న కేంద్రం భేటీ
ABN , Publish Date - May 02 , 2025 | 06:19 AM
కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయడానికి రాష్ట్రాల అభిప్రాయాల కోసం మే 7న కేంద్ర జలశక్తి మంత్రి నీటి పారుదల మంత్రులతో సమావేశం నిర్వహించనున్నాడు. తీర్పుపై ఏకాభిప్రాయం వస్తే వెంటనే దాన్ని నోటిఫై చేయనున్నారు.
తీర్పును ప్రచురించేందుకు అభిప్రాయ సేకరణ
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్(కృష్ణా ట్రైబ్యునల్-2) వెలువరించిన తీర్పును నోటిఫై చేయడానికి వీలుగా రాష్ట్రాల అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 7న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రభావిత రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. కృష్ణా జలాల పంపిణీపై 2013 నవంబరు 29న ట్రైబ్యునల్-2 అవార్డు వెలువరించింది. దీనిని ప్రచురితం(కేంద్ర ం నోటిఫై) చేయొద్దని కోరుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక ఆ రాష్ట్రం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. ఈ తీర్పుపై విచారణ జరుగుతున్న క్రమంలో కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలకు పంచడానికి వీలుగా కేంద్రం విధి విధానాలు జారీ చేయగా.. దీనిపై ప్రస్తుతం ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. అయితే ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు పంచడానికి విచారణ జరుగుతున్న నేపథ్యంలో తక్ష ణమే ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక కేంద్రాన్ని కోరుతున్న విషయం విదితమే. దాంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులతో ఈ నెల 7న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఏకాభిప్రాయం కుదిరితే.. తీర్పును కేంద్రం నోటిఫై చేయనుంది. ఆ వెంటనే బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు అమలు కానున్నాయి.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News