Home » CWC
తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టం లేకనే పాట్నలో సీడబ్ల్యూసీ పెట్టారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ డ్రైవింగ్ సీటు తీసుకుని ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలనుకుంటోందని చెప్పారు.
కాంగ్రెస్ 10 అంశాల కార్యక్రమంలో భాగంగా ఈబీసీల కోసం 'ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్' తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఎస్సీ/ఎస్టీలకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల తరహాలోనే ఇది ఉంటుందని తెలిపింది.
జాతీయంగా, అంతర్జాతీయంగా దేశం సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని ఖర్గే అన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వ దౌత్య వైఫల్యాల కారణంగానే అంతర్జాతీయంగా మనం సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
బీహార్‌లోని 25 జిల్లాల్లో ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.
సిడబ్ల్యుసి ఛైర్మన్ అతుల్ జై తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ నీటిపారుదలకు సంబంధించి అనేక విషయాలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా..
ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని గత సీడబ్ల్యూసీ సమావేశం స్పష్టం చేసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా కేంద్రం ఇంతరవకూ స్పష్టమైన హ్యూహంతో ముందుకు రాలేదని అన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఢిల్లీలో జరిగే ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఆయన జాతీయ నాయకులకు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి ఒక దారుణమైన ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్, దీనిని ప్రజాస్వామ్యంపై నేరుగా దాడిగా భావించింది. భద్రతా వ్యతిరేకంగా నిఘా వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు
Pehalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీవ్రంగా ఖండించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర హోం శాఖ పర్యవేక్షిస్తోందని.. అలాంటి చోట ఈ దాడి జరగడం పట్ల సీడబ్ల్యూసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది కేంద్ర వైఫల్యమని స్పష్టం చేసింది.
Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సంతాప తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో మన్మోహన్ సింగ్ తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో ఏ విధంగా పరుగు పెట్టిందో ప్రశంసలు కురిపించింది.