Share News

Patna CWC Meeting: పాట్నాలో ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం..

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:55 AM

బీహార్‌లోని 25 జిల్లాల్లో ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.

Patna CWC Meeting: పాట్నాలో ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం..
Patna-CWC-Meeting

బిహార్: పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో కాంగ్రెస్ జెండాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. ఈ సమావేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎల్పీ లీడర్లు, పీసీసీ అధ్యక్షులు హజరయ్యారు. బిహార్ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పే లక్ష్యంగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తుంది.


బీహార్‌లోని 25 జిల్లాల్లో ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ మేరకు రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని బీహార్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.


ఈ ఏడాది చివరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కీలకంగా మారింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తీసుకునే విధానం, సైద్ధాంతిక నిర్ణయాలు ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓటు లెక్కింపు విషయంలో అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల మధ్య సమావేశం జరుగుతోంది. అలాగే ఓటు లెక్కింపులో అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయ ప్రాముఖ్యత దృష్ట్యా సమావేశంలో రాబోయే బీహార్ ఎన్నికలు ప్రధాన చర్చా అంశంగా ఉండనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

కమిషనర్‌ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు

Updated Date - Sep 24 , 2025 | 11:58 AM