Home » Patna
ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి ఎన్డీయే గెలుపు ఖాయమని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఎన్డీయే చేపట్టిన అభివృద్ధి మోడల్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది చాటుతోందన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్‌షా చెప్పారు.
ఎలక్షన్ కమిషన్ టీమ్ మొత్తం రెండ్రోజులుగా బిహార్‌లోనే ఉందని, రాష్ట్ర పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధిపతులు, నోడల్ అధికారులతో సమావేశాలను నిర్వహించామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.
జాతీయంగా, అంతర్జాతీయంగా దేశం సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని ఖర్గే అన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వ దౌత్య వైఫల్యాల కారణంగానే అంతర్జాతీయంగా మనం సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
బీహార్‌లోని 25 జిల్లాల్లో ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.
దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.
రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు.
బిహార్‌లో ఎన్నికల కమిషన్ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఐఎస్ఆర్ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్టు పట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానికులు తుపాకీ కాల్పులు విని అక్కడికి చేరుకునే లోగానే..
ఘటన అనంతరం స్థానిక పోలీస్, పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. బైక్‌పై వచ్చిన అగంతకుడు ఈ కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పాట్నా సెంట్రల్ ఎస్పీ దీక్ష తెలిపారు.