Share News

Mallikarjun Kharge: ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు నిర్దిష్ట వ్యూహం ఏది?.. కేంద్రాన్ని ప్రశ్నించిన ఖర్గే

ABN , Publish Date - May 02 , 2025 | 08:02 PM

ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని గత సీడబ్ల్యూసీ సమావేశం స్పష్టం చేసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా కేంద్రం ఇంతరవకూ స్పష్టమైన హ్యూహంతో ముందుకు రాలేదని అన్నారు.

Mallikarjun Kharge: ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు నిర్దిష్ట వ్యూహం ఏది?.. కేంద్రాన్ని ప్రశ్నించిన ఖర్గే

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు విపక్షాలు కేంద్రంతో ఉన్నాయని తాము స్పష్టం చేసినప్పటికీ ఇంతవరకూ కేంద్ర వద్ద నిర్దిష్టమైన వ్యూహం ఏమీ కనిపించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. శుక్రవారంనాడిక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (CWS)లో ఆయన మాట్లాడుతూ, కులగణన చేపట్టాలని కాంగ్రెస్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిదని, అయితే కేంద్రం నిర్ణయం తీసుకున్న సమయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశాలపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. కులగణనపై ఒక లాజికల్ కంక్ల్యూజన్‌ వచ్చేంతవరకూ పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

IAF: ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్


ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని గత సీడబ్ల్యూసీ సమావేశం స్పష్టం చేసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా కేంద్రం ఇంతరవకూ స్పష్టమైన హ్యూహంతో ముందుకు రాలేదని అన్నారు. కులగణన నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రెడిట్ రాహుల్ గాంధీకే దక్కుతుందని, ప్రజా సమస్యలపై నిజాయితీగా గళం విప్పితే ప్రభుత్వం దిగిరాక తప్పదని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ మరోసారి నిరూపించారని కొనియాడారు. ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ కాన్పూర్‌లో పరామర్శించారని, వారికి అమరుల హోదా కల్పించాలని కోరారని ఖర్గే చెప్పారు.


ఖర్గే ప్రసంగంలో ఇంకా..

-పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏప్రిల్ 24న సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాం. ఉగ్రవాదంపై పోరుకు, ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని తీర్మానం ఆమోదించాం.

-హహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు రాలేదు.

-రాహుల్ గాంధీ కాన్పూర్‌లో శుభం ద్వివేది కుటుంబ సభ్యులను కలిసారు. అమరవీరుల హోదా కల్పించాలని కోరారు.

-దేశ ఐక్యత, సమగ్రత, అభ్యదయం విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా సమష్టి ఎదుర్కొనేందుకు మేము సిద్ధం. ఈ విషయంలో విపక్షాలన్నీ ప్రభుత్వానికి బాసటగా ఉంటాయి. మేము ఈ సందేశాన్ని యావత్ ప్రపంచానికి చాటాం.

-ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం దేశ జనాభా గణనతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయించింది.

-ఈ విషయంలో నేను రాహుల్ గాంధీని మొదట అభినందిస్తున్నాను. కులగణన అంశాన్ని రాహుల్ లేవనెత్తి, ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేశారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ శక్తివంతమైన ప్రచారం సాగించారు. దీంతో 18వ లోక్‌సభ ఎన్నికల్లో సామాజిక న్యాయం అనేది కీలకాంశమైంది.

-నిజాయితీతో ప్రజాసమస్యలను లేవనెత్తితే ప్రభుత్వం దిగివస్తుందని రాహుల్ నిరూపించారు. భూ సేకరణ సవరణ బిల్లు, మూడు రైతు చట్టాల ఉపసంహరణ తర్వాత ఆ జాబితాలో ఇప్పుడు కులగణన కూడా వచ్చి చేరింది. కులగణనపై ప్రభుత్వం దిగివచ్చింది.

-తెలంగాణ, కర్ణాటకలో కులసర్వే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి చేశాయి. ప్రభుత్వ పథకాలలో దీనిని అమలు చేయడం కూడా మొదలైంది.

-గుజరాత్‌లో 2025 ఏప్రిల్ 9న జరిపిన ఏఐసీసీ సదస్సులో మా డిమాండ్‌ను పునరుద్ఘాటించాం. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ సవరణ ద్వారా పరిమితిని ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభించాలి.

-కులగణన విషయంలో 2023 ఏప్రిల్ 16న ప్రధానికి లేఖ రాసినప్పుడు ప్రభుత్వం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది.

-ప్రభుత్వం మా డిమాండ్‌ను ప్రతి వేదికపైన వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇది విభజన నిర్ణయం, అర్బన్ నక్సల్స్ నిర్ణయం అంటూ విమర్శించింది. మోదీ నుంచి ఆర్ఎస్ లీడర్ల వరకూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర ఎన్నికల్లో మా డిమాండ్‌ను విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకోవడంతో ఆ క్రెడిట్ బీజేపీకి, ప్రధాన మంత్రికి దక్కుతుందంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 02 , 2025 | 08:03 PM