Share News

IAF: ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్

ABN , Publish Date - May 02 , 2025 | 06:10 PM

యుద్ధవిమానాలు పగటి వేళలలోనే కాకుండా, రాత్రి వేళ్లల్లోనూ ఇక్కడ దిగేందుకు వీలుగా షాజహాన్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ఇంతవరకూ, ఇదేతరహా అత్యవసర ల్యాండింగ్ డ్రిల్స్‌ను లక్నో-ఆగ్రా, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలలో నిర్వహించారు.

IAF: ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్

షాజహాన్‌పూర్: భారత వాయిసేన యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్, టేకాఫ్‌ తీసుకునేందుకు అవసరమైన డ్రిల్స్ శుక్రవారంనాడిక్కడ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌పై ఉన్న దాదాపు 3.5 కిలోమీటర్ల స్ట్రిప్‌‌పై ఈ డ్రిల్స్ చేపట్టారు. దేశ రక్షణ సన్నద్ధతల్లో భాగంగా ఇదొక మైలురాయిగా చెప్పవచ్చు.

Pahalgam Attack: రెండు నెలలు ఆహారం నిల్వ చేసుకోండి.. పౌరులను కోరిన పీఓకే


యుద్ధవిమానాలు పగటి వేళలలోనే కాకుండా, రాత్రి వేళ్లల్లోనూ ఇక్కడ దిగేందుకు వీలుగా షాజహాన్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ఇంతవరకూ, ఇదేతరహా అత్యవసర ల్యాండింగ్ డ్రిల్స్‌ను లక్నో-ఆగ్రా, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలలో నిర్వహించారు. అయితే పగటి వేళల్లోనే ఈ ఆపరేషన్లు జరిపారు.


భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ షజహాన్‌పూర్‌లోని గంగాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపే వాయిసేన యుద్ధవిమానాల డ్రిల్స్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌‌ తర్వాత యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన నాలుగో ఎక్స్‌ప్రెస్‌వే షాజహాన్‌‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే కావడం విశేషం. రాఫెల్, ఎస్‌యూ-30 ఎంకేఐ, మిరేజ్ 2000, మిగ్-29, జాగ్వార్, సి-130జే సూపర్ హెర్క్యులెస్, ఏఎన్-32, ఎఐ-17 V5 హెలికాప్టర్ తదిరర ఐఏఏ విమానాలు ఈ డ్రిల్స్‌లో పాల్గొంటున్నాయి.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 02 , 2025 | 06:13 PM