Share News

BJP On Congres CWC Meet: తేజస్వికి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టంలేకే పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం

ABN , Publish Date - Sep 24 , 2025 | 08:56 PM

తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టం లేకనే పాట్నలో సీడబ్ల్యూసీ పెట్టారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ డ్రైవింగ్ సీటు తీసుకుని ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలనుకుంటోందని చెప్పారు.

BJP On Congres CWC Meet: తేజస్వికి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టంలేకే పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం
Ravishankar Prasad

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం (CWC Meet) నిర్వహించడంపై బీజేపీ (BJP) బుధవారంనాడు విమర్శలు గుప్పించింది. 85 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు పాట్నా గుర్తొచ్చిందా? అని ప్రశ్నించింది. పూర్తిగా రాజకీయ లెక్కలను దృష్టిలో పెట్టుకునే బిహార్‌లో ఆ పార్టీ సమావేశం జరిపిందని బీజేపీ సీనియర్ నేత, పాట్నాసాహిబ్ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ (Ravishankar Prasad) మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


'పాట్నలో 85 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం జరపడం ఇదే మొదటిసారి. ఇంత అకస్మాత్తుగా పాట్నా ఎందుకు గుర్తొచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశం నిర్వహించారు' అని రవిశంకర్ ప్రసాద్ విశ్లేషించారు. తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టం లేకనే పాట్నలో సీడబ్ల్యూసీ పెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డ్రైవింగ్ సీటు తీసుకుని ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలనుకుంటోందని చెప్పారు. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా కాంగ్రెస్ వెనకాడుతోందని తెలిపారు.


ఆర్జేడీ హయాంలో అహహరణలు, అవినీతి, కుంభకోణాలు లెక్కకు మిక్కిలిగా చోటుచేసుకున్నప్పుడు, కుల ఆధారిత ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు గొంతు వినిపించలేదని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయనను ఏమాత్రం కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఒక చిన్న గది మాత్రమే ఇచ్చిందని అన్నారు. 'పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం సదకత్ ఆశ్రమం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కేంద్రస్థానం. దేశ తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ సదకత్ ఆశ్రమంలో నివసించారు. నేను ఎంపీ అయిన తర్వాత అక్కడకు వెళ్లాను. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడ రెండే గదులున్నాయి. చిన్న కోర్ట్‌యార్డ్, ఒక టాయిలెట్ మాత్రమే ఉన్నాయి' అని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతి కావడం నెహ్రూకు ఇష్టం లేదని ఆరోపించారు. రెండో టర్మ్ ఇవ్వకూడదని అనుకున్నారని చెప్పారు. జయప్రకాష్ నారాయణ్ అరెస్టయినప్పుడు కాంగ్రెస్ ఎందుకు బీహార్‌ను పట్టించుకోలేదు? జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రిజర్వేషన్.. బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం

బిహార్ ఎన్నికలు మోదీ అవినీతి పాలన అంతానికి నాంది: ఖర్గే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2025 | 08:57 PM