Uttam - CWC కేంద్ర జల సంఘం ఛైర్మన్ తో ఉత్తమ్ భేటీ
ABN , Publish Date - May 07 , 2025 | 06:59 PM
సిడబ్ల్యుసి ఛైర్మన్ అతుల్ జై తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ నీటిపారుదలకు సంబంధించి అనేక విషయాలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా..
Uttam Kumar Reddy - CWC Chairman Atul Jai: కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) ఛైర్మన్ అతుల్ జైన్ తో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఇవాళ భేటీ అయ్యారు. మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్టులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడం పై “జాతీయ డామ్ సంరక్షణ సంస్థ”(ఎన్.డి.ఎస్.ఏ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇంకా.. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి చూస్తే.. సమ్మక్క, సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు. కృష్ణానది పై పలు చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు అంశం కూడా ఉంది. అనంతరం సమావేశం గురించి ఉత్తమ్ వివరాలు వెల్లడించారు.
"మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీ లను పునరుద్ధరించాలా లేదా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేడిగడ్డ డిజైన్.. ఆపరేషన్ లోపాలు ఉన్నాయని ఎన్ డి ఎస్ ఏ నివేదిక స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రాజెక్ట్ పునరుద్ధరణ ఎలా చేయాలని మార్గాలు అన్వేషిస్తున్నాం. డిపిఆర్ లో చూపెట్టిన స్థలం వేరు, ఒక ప్రాంతంలో కడతామని మరో ప్రాంతంలో మేడిగడ్డ కట్టారు. మేడిగడ్డ , సుందిళ్ల బ్యారేజ్ ల విషయంలో సిడబ్ల్యుసి సంప్రదింపులతో ముందుకు వెళ్లాలని ఎన్డీఎస్సీ సూచించింది. పాడైపోయిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్ లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించా. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కడతాం. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టిఎంసిల నీటి కేటాయింపులు వేగంగా జరపాలని కోరా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కి 90 టీఎంసీలు నీటి కేటాయింపులు చేశారు. మొదటి ఫేస్ కింద వాటిలో తక్షణమే 45 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశాను. అక్రమ నీటి తరలింపుకు చెక్ పెట్టేందుకు కృష్ణాజలాలకు టెలిమెట్రీ పెట్టాలని కోరాం. పోలవరం బ్యాక్ వాటర్ తో తెలంగాణ కొంత ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దానికి రిటెన్షన్ వాల్ ను నిర్మించాలని కోరాం." అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
ౌBank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News