ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కేటీఆర్‌పై మరో కేసు నమోదు.. ఎందుకంటే..

ABN, Publish Date - Jun 14 , 2025 | 09:00 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు.

KTR

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై (KTR) సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలపై ఇవాళ(శనివారం) కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులొ తెలిపారు. ఈ కేసుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. రాజకీయ కక్ష్యలో భాగంగానే తమ నేతపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు..

కాగా, కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. సోమవారం ఉదయం 10గంటలకు విచారణకు రావాలని ఏసీబీ కోరింది. ఫార్ములా ఈ రేస్‌లో డిసెంబర్ 29, 2024న ఎఫ్ఐఆర్‌ని ఏసీబీ నమోదు చేసింది. జనవరి 6వ తేదీన తన లాయర్లతో ఏసీబీ విచారణకు కేటీఆర్‌ వెళ్లారు. అయితే కేటీఆర్‌ని విచారించడానికి ఏసీబీ అధికారులు అనుమతించలేదు. జనవరి 8వ తేదీన ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. 7గంటల పాటు ఏసీబీ ఆయనను విచారించింది. జనవరి 9వ తేదీన మరోసారి విచారణకు ఏసీబీ పిలిచింది. విచారణకు కొంత సమయం కావాలని కేటీఆర్ కోరారు. మే 28వ తేదీన విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన కారణంగా పర్యటన ముగిసిన తర్వాత వస్తానని కేటీఆర్ తెలిపారు. దీంతో సోమవారం ఉదయం 10గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు

పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 09:26 AM