ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: ఇద్దరు పిల్లల ఉసురు తీసి.. ఉరేసుకొని!

ABN, Publish Date - May 06 , 2025 | 05:43 AM

భార్యాభర్తల మధ్య గొడవలు అభంశుభం తెలియని వారి బిడ్డల ప్రాణాలను బలిగొన్నాయి. దంపతులు తరచూ మాటామాటా అనుకుంటుండటం, భార్య అలిగి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు.

  • గొంతు నులిమి పిల్లల్లి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

  • ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు

  • భార్య గొడవపడి వెళ్లిపోవడంతో దారుణం

  • 10 పేజీల సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

  • సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఘటన

కొండాపూర్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల మధ్య గొడవలు అభంశుభం తెలియని వారి బిడ్డల ప్రాణాలను బలిగొన్నాయి. దంపతులు తరచూ మాటామాటా అనుకుంటుండటం, భార్య అలిగి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన కూతురు, కుమారుడిని గొంతునులిమి చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించడంతో నాలుగురోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. సీఐ వెంకటేశ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని గారకుర్తి గ్రామానికి చెందిన బాయికాడి సుభాష్‌(45) సదాశిపేట మండలం ఆత్మకూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.


సంగారెడ్డి మునిసిపాలిటీ ఎంఆర్‌ఎఫ్‌ కాలనీలో భార్య మంజుల, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సుభాష్‌, మంజుల మధ్య మనస్పర్థాలు పెరిగాయి. భర్త తీరు నచ్చక మంజుల ఇంటి నుంచి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన సుభాష్‌.. ఇంట్లోనే కుమారుడు ఆర్యన్‌(13), కూతురు ఆరాధ్య(5)ను గొంతు పిసికి చంపాడు. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపల చూసేసరికి పిల్లలు ఆర్యన్‌, ఆరాధ్య, సుభాష్‌ మృతదేహాలు కనిపించాయి. సుభాష్‌ రాసిన పది పేజీల సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:43 AM