Harish Rao: అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదు
ABN, Publish Date - May 06 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, సీఎంకు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
రైతు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: హరీశ్ రావు
సిద్దిపేట కలెక్టరేట్, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, సీఎంకు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీశ్ రావు రైతులను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు అని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనడం లేదని, రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని, ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే చోటుచేసుకుంటున్న ఈ రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఈ మరణాలకు బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమయిందని, ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతులు దినదినగండంగా గడుపుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి, ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రతి రైతుకూ మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు. పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News
Updated Date - May 06 , 2025 | 04:28 AM