ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఎమ్మెల్యే కార్యాలయంలో చెప్పులు విప్పేచోట పాకిస్థాన్‌ జెండా

ABN, Publish Date - May 01 , 2025 | 10:07 AM

భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ కార్యాలయం వద్ద పాకిస్థాన్‌ జెండా స్టిక్కర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. అయితే.. ఎమ్మెల్యే మాత్రం తిరుపతి వెళ్లారు. కార్యాలయం వద్ద చెప్పులు విడిచే స్థలంలో పాకిస్థాన్‌ జెండా స్టిక్కర్లను అతికించడం కలకలం సృష్టించింది.

హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌(Goshamahal MLA T. Rajasingh) వినూత్న నిరసనకు తెర తీశారు. తన కార్యాలయానికి వచ్చిన సందర్శకులు చెప్పులు విడిచే స్థలంలో పాకిస్థాన్‌ జెండా స్టిక్కర్లను అతికించడం కలకలం సృష్టించింది. సమాచారమందుకున్న మంగళ్‌హాట్‌ పోలీసులు వాటిని తొలగించారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో భారత్‌ జెండాలను తగులబెడుతున్నారని, మన దేశంలో మాత్రం పోలీసులు ఇలా వ్యవహరించడం తగదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పోలీస్‏స్టేషన్ల పేరు మార్పు..


పోలీసుల తీరుపై ఆగ్రహం

కాగా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజాసింగ్‌ తిరుపతిలో జెండా వివాదంపై స్పందించారు. ‘మా ఆఫీసులోకి వచ్చివెళ్లే వారు పాకిస్థాన్‌ జెండాను తొక్కాలని గడపలో అతికించాం. మా తెలంగాణ పోలీసులు వచ్చి ఆ జెండాను తీసేసి వెళ్లారని మా కార్యకర్తలు నాకు సమాచారం ఇచ్చారు. నేను పోలీసులను అడిగితే అది పాకిస్థాన్‌ జెండా కాదు.. ఒక మతానికి చెందిన జెండా అంటున్నారు. నేను పాకిస్థాన్‌ జెండాకు, మతానికి సంబంధించిన జెండాకు తేడా చెప్పాను. తెలంగాణ పోలీసులకు అది కూడా అవగాహన లేదు. ఢిల్లీలో ప్రధాని మోదీ మంచి సమావేశం నిర్వహించి ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పనున్నారు’ అని రాజాసింగ్‌ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా

ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు

సాగర్‌కు యజమాని తెలంగాణే

సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నా..

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2025 | 10:07 AM