ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మరీ ఇంత నిర్లక్ష్యమా!

ABN, Publish Date - May 08 , 2025 | 04:33 AM

మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలను సంబంధిత అధికారులు ఇప్పటిదాకా ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి అసంతృప్తి చెందారని, ఓ కీలక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

  • మెట్రో విస్తరణపై కేంద్రానికి వివరాలివ్వడంలో ఆలస్యంపై రేవంత్‌ సీరియస్‌

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలను సంబంధిత అధికారులు ఇప్పటిదాకా ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి అసంతృప్తి చెందారని, ఓ కీలక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికంగా సహకరించాలని కేంద్రాన్ని కోరుతోంది.


ఈ క్రమంలో మెట్రో విస్తరణకు సంబంధించి కొన్ని వివరాలను అందించాలంటూ ఇటీవల కేంద్రం సంబంధిత అఽధికారులకు ఓ లేఖ పంపినట్లు తెలిసింది. అయితే, అధికారులు ఆ సమాచారం పంపలేదు. ఇదే విషయం తాజాగా సీఎం దృష్టికి రావడంతో మంగళవారం సమీక్ష సందర్భంగా మెట్రో ముఖ్య అధికారిని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుపై మరీ ఇంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కేంద్రం అడిగిన వివరాలను వారంలోగా పంపాలన్నారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:33 AM