ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కేటీఆర్‌కు అహంకారం.. కిషన్‌రెడ్డికి కుళ్లు

ABN, Publish Date - Mar 03 , 2025 | 03:41 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు.

ఆయన కన్నా జూనియర్‌గా ఉన్న నేను ఎదిగానని అసూయ

  • రాష్ట్రానికి మంచి చేయాలని మోదీకి ఉన్నా.. కిషన్‌రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారు

  • ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకుంటున్నారు

  • రాకపోతే రేవంత్‌ ఏం చేయలేదంటున్నారు

  • ఎయిర్‌పోర్టు తెచ్చింది ఆయనే ఐతే.. మూసీ, ఆర్‌ఆర్‌ఆర్‌, మెట్రోలను అడ్డుకున్నదెవరు?

  • కేంద్రం వద్ద ఈడీ, సీబీఐ ఉన్నాయని ఎంత కాలం బెదిరిస్తారు? చావు ఓ సారే వస్తుంది

  • కృష్ణాలో ఎక్కువ నీటిని ఏపీకి ఇస్తూ కేసీఆర్‌ పెట్టిన సంతకం రాష్ట్రానికి యమపాశమైంది

  • ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నరు.. ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు?

  • వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

  • ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి, రేవంతన్న భరోసా పథకాలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌కు అహంకారం ఉంటే.. కిషన్‌రెడ్డికి కుళ్లు ఉందని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించిన ముఖ్యమంత్రి రూ.879.80 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులిచ్చి మంచి చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నా.. కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. తాము కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధాన మంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే.. కిషన్‌రెడ్డి తానే తెచ్చానంటూ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. వస్తే తన ఖాతాలోకి, రాకపోతే రేవంత్‌రెడ్డిఏమీ చేయడంలేదని ఆరోపించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ‘‘నేను కష్టపడి మామునూరు ఎయిర్‌పోర్టుకు అనుమతులు తెస్తే.. తానే తెచ్చానని కిషన్‌రెడ్డి చెప్పుకుంటున్నారు. అలా అయితే మూసీ ప్రక్షాళనకు, మెట్రో విస్తరణకు, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాల పనులకు, పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి కేటాయింపులు, సమ్మక్క-పారక్క, సీతారామ సాగర్‌లకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది ఆయనేనని భావించాల్సి వస్తుంది’’ అని రేవంత్‌ అన్నారు. తాను కిషన్‌రెడ్డి ఒక సందర్భంలో కలిసి పనిచేశామని, ఆయన కంటే చిన్నవాడిని, జూనియర్‌ను అయిన తాను ఎదగడం ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు.


ఆ ఇద్దరు చిల్లిగవ్వ కూడా తేలేదు..

తాను ఈ 14 నెలల కాలంలో 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చానని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో కేవలం కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. వీరిద్దరు కేంద్రం నుంచి చిల్లిగవ్వ తేలేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై సమీక్ష కోసం కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాకుండా రెండుసార్లు కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారని, ఆయన వస్తే సమీక్షకు రాలేదన్నారు. ఈటల రాజేందర్‌ వచ్చి మేడ్చల్‌ వరకు మెట్రోను విస్తరించాలని కోరారని తెలిపారు. కేంద్రం దగ్గర ఉన్న సీబీఐ, ఈడీతో ఎంతకాలం బెదిరిస్తారని ప్రశ్నించారు. చావు ఒక్కసారే వస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కిషన్‌రెడ్డి సమీక్ష పెడితే తెలంగాణ ఎంపీలంతా వచ్చి ప్రతిపాదనలు ఇస్తారని, వాటి ప్రకారం నిధులు మంజూరు చేయించాలని డిమాండ్‌ చేశారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిలో ఏపీకి 512 టీఎంసీల కేటాయింపును సమర్థి ్ధస్తూ కేసీఆర్‌ పెట్టిన సంతకం తెలంగాణకు యమపాశమైందని అన్నారు. ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెంచుకోవడానికి తండ్రి వైఎ్‌సఆర్‌కు, స్వరాష్ట్రం ఏర్పడ్డాక రాయలసీమ లిఫ్టుకు పునాది వేసి కొడుకు జగన్‌కు కేసీఆర్‌ సాయం చేశారని ఆరోపించారు. పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్‌.. కాంగ్రెస్‌ హయాంలో 32 కిమీలు పూర్తయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను వదిలేశారని మండిపడ్డారు. రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పి లిఫ్టుకు కర్త, కర్మ, క్రియగా మారారని ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేక ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.


మనఃసాక్షితో చూడండి...

ప్రభుత్వం చేస్తున్న, చేసిన పనులను బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు మనఃసాక్షితో చూడాలని సీఎం రేవంత్‌ అన్నారు. 25.50 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, కేసీఆర్‌ ఎగవేసిన రైతుబంధు సాయం రూ.7,627 కోట్లు ఇచ్చామని, కోతలు లేకుండా విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. అలాగే 50 లక్షల మందికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌, బీసీ కార్పొరేషన్‌, ట్రైబల్‌ కార్పొరేషన్‌, మైనారిటీ కార్పొరేషన్‌లను పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధి పథకాలకు రూ.6 వేల కోట్లు అందజేస్తామని చెప్పారు.

31లోపు రైతు భరోసా

కేటీఆర్‌, హరీశ్‌రావు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, గడీని దాటి బయటకు రాలేని కేసీఆర్‌ వీరిద్దరితో మాట్లాడిస్తున్నారని భట్టివిక్రమార్క మండిపడ్డారు. రెండో విడత రైతు భరోసా మార్చి 31లోపు జమ చేస్తామని అన్నారు. కాగా, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పదేళ్లు నిర్లక్ష్యం చేసి.. అనుకోని ప్రమాదం జరిగితే బీఆర్‌ఎస్‌ నేతలు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.


మహిళా శక్తి, రేవంతన్న భరోసా

వనపర్తి అర్బన్‌: ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి, రేవంతన్న భరోసా పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా 50మంది ముస్లింమహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలో రూ.36.64 కోట్లతో 42 వేల 230 మందికి మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

చదువుకునే రోజుల్లో అద్దెకున్న ఇంటికి రేవంత్‌

వనపర్తి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబం ఎంతో ఆప్యాయంగా హారతులిచ్చి రేవంత్‌ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా అప్పట్లో ఆ కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. వారు చేసిపెట్టిన పూరీలు తింటూ వారితో సరదాగా గడిపారు. వారితో ఫొటోలు దిగారు. ‘ఇది రక్త సంబంధం కాదు.. అంతకంటే ఎక్కువైన అనుబంధం. వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ ఆనాడు అక్క ఇంట్లో ఆత్మీయతను ఆస్వాదిస్తూ పెరిగా. ఆ జ్ఞాపకాలను మోసుకుని ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా’ అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో సీఎం రేవంత్‌ పోస్టు చేశారు. మరోవైపు వనపర్తిలో తనతో కలిసి చదువుకున్న స్నేహితులతోనూ రేవంత్‌ కొద్దిసేపు గడిపారు. గత స్మృతులను నెమరువేసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: SLBC Incident: ఎస్ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు

Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది

Also Read: ఏపీలో కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పో.. ఎక్కడంటే..

Also Read: కుమార్తె కోసం పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన కేంద్ర మంత్రి

Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి చురకలు

Also Read: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..

Updated Date - Mar 03 , 2025 | 03:41 AM