Share News

Maha Kumbh Mela: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:22 PM

Maha Kumbh Mela: 144 ఏళ్లకు ఒక సారి వచ్చే మహాకుంభ మేళ.. ఇటీవల ప్రయాగ్ రాజ్‌లో ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కోట్లాది మంది యాత్రికులతో నిత్యం కిటకిటలాడిన ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. అసలు ఇక్కడేనా మహాకుంభమేళ జరిగిందనే ఓ అశ్చర్యం అయితే కలుగక మానదు.

 Maha Kumbh Mela: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..

లక్నో, మార్చి 02: ప్రయాగ్ రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళ యాత్రికులతో కిక్కిరిసిపోయింది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఆ మహా కుంభమేళలో అమృత స్నానాన్ని చేసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తారు. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాగిన ఈ మహా కుంభమేళ.. జనసంద్రంగా మారింది. ఈ కుంభమేళ ఇటీవల ముగియడంతో.. ప్రయాగ్ రాజ్ పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.

mahakumbha-mela-01.jpg

ఇక ప్రయాగ్ రాజ్‌ త్రివేణి సంగమం ప్రాంతంతోపాటు పరిసర ప్రాంతాలను 15 రోజుల్లో శుభ్రం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. దీనిని ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంచింది. అందులోభాగంగా యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తీసి వేస్తున్నారు. అలాగే సంగమం ఘాట్లు, రహదారులను శుభ్రం చేస్తున్నారు. ఇక యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మౌలిక సదుపాయాలను సైతం తొలగిస్తున్నారు. అదీకాక.. 45 రోజుల పాటు యాత్రికులతో జనసంద్రంగా మారిన ఆ ప్రాంతం ప్రస్తుతం అతి కొద్ది మంది యాత్రికులతో ఉంది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది


ఆయన ఆధ్వర్యంలో..

mahakumbhamela-02.jpg

ఇక ఈ ప్రాంతంలో పరిశుభ్ర పరిచే కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి ఆకాంక్ష రానా పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛతా మిత్రా, గంగా సేవా దుత్‌లో ఈ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలోని వ్యర్థాలను నైనీలోని నిర్వీర్యం చేసేందకు బస్వార్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. మరోవైపు ఈ మహాకుంభమేళలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు 15 వేల పారిశుద్ధ్య పనివారితోపాటు 2 వేల గంగా సేవా దూత్‌లను ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


గిన్నిస్ రికార్డులు..

maha-khumbamela-03.jpg

దీంతో మహాకుంభమేళ జరిగినన్ని రోజులు.. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచారు. ఇక 45 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళలో రోజుకు 1.5 కోట్ల మంది భక్తులు ఈ సంగమంలో స్నానం చేశారు. ఇది మూడు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. అదే విధంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన కేబినెట్ మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ మహాకుంభమేళకు హాజరయ్యారు. విదేశీ ప్రముఖులు సైతం ప్రయాగ్ రాజ్ విచ్చేశారు.


తప్పలేదు తొక్కిసలాట..

maha-khumba-mela-04.jpg

జనవరి 29వ తేదీ మౌని అమావాస్య. ఈ రోజు మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 30 మంది మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఈ మహాకుంభమేళలో పలుమార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఇక యాత్రికుల రద్దీతో దాదాపు 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏదీ ఏమైనా.. దాదాపు 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ మహాకుంభమేళ.. రికార్డు సృష్టించింది.

mahakhumbamela.jpg

For National News And Telugu News

Updated Date - Mar 02 , 2025 | 04:32 PM