Construction Expo: ఏపీలో కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పో.. ఎక్కడంటే..
ABN , Publish Date - Mar 02 , 2025 | 07:27 PM
Construction Expo: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతోన్నాయి. ఆ క్రమంలో మూడు రోజుల పాటు కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు.
విజయవాడ, మార్చి 02: రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అతిపెద్ద కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పో నిర్వహించనుంది. మార్చి 4, 5, 6 తేదీల్లో విజయవాడలో ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏపీ కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పోను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో షైనీ గ్రూప్ అధినేత షేక్ బాజీ మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
అమరావతి నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు చాలా విజన్‌తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో స్మార్ట్ సిటీగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని ఆయన వివరించారు. అయితే నిర్మాణ రంగంలో కొత్త విధానాలు వచ్చాయని.. సాంకేతికతను ఉపయోగించుకొని నిర్మాణాలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఈ ఎక్స్ పోలో వివిధ నిర్మాణ రంగాలకు సంబంధించిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. అలాగే ఈ ఎక్స్ పోలో పలు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో చర్చ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నిర్మాణ రంగంలో రావాల్సిన మార్పులు, అదే విధంగా అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం తదితర అంశాలపై ఈ ఎక్స్ పోలో చర్చ జరుగుతోందన్నారు.
Also Read: కుమార్తె కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేంద్ర మంత్రి
ఇక టీడీపీ అధికార ప్రతిని మహ్మద్ రఫీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి మంచి ఊపు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ.. ఏపీ కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పోలో పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ ఎక్స్ పోలో అందరూ భాగస్వామ్య కావాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి చురకలు
గతేడాది అంటే 2024.. మే, జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. నాటి నుంచి రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలు ఊపందుకొన్నాయి. అదీకాక.. కూటమిలో బీజేపీ సైతం భాగస్వామ్యం కావడంతో.. ఈ రెండు ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ క్రమంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్రం సైతం కీలక భూమిక పోషిస్తోంది.
Also Read: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..
మరోవైపు రాజధాని అమరావతికి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. అలాగే తన పాదయాత్రలో సైతం ఆయన కీలక హామీలు ఇచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. దీంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏపీకి మూడు రాజధానులంటూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. పోని ఆ దిశగా మూడు రాజధానుల నిర్మాణాలు ఏమైనా చేపట్టారా? అంటే అది లేదు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది
ఇంకోవైపు సీఎం జగన్ ప్రకటనతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు.. 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు సాగాయి. ఇక ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు పక్క క్లారిటీగా సమాధానం ఇవ్వడంతో... కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. నాటి నుంచి రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అందులోభాగంగా కన్ స్ట్రక్షన్ ఎక్స్ పోను ఏర్పాటు చేస్తున్నారు.
For Andhrapradesh News And Telugu News