Raksha Khadse: కుమార్తె కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Mar 02 , 2025 | 06:34 PM
Raksha Khadse: శివరాత్రి వేళ జాతరకు వెళ్లిన కేంద్ర మంత్రి కుమార్తెకు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కుమార్తెతో కలసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆకతాయిలపై ఫిర్యాదు చేశారు.
ముంబై, మార్చి 02: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెను వేధింపులకు గురి చేసిన కేసులో ఒకరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జల్‌గావ్ జిల్లాలో నిర్వహించిన జాతరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని తల్లికి ఆమె వివరించింది.
ఈ నేపథ్యంలో ముక్తాయినగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ బయట కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. శివరాత్రి వేళ కొతాలిలో ప్రతి ఏటా జాతర నిర్వహిస్తారని గుర్తు చేశారు. ఈ జాతరకు తన కుమార్తె వెళ్లిందన్నారు. ఈ జాతరలో ఆమెను అకతాయిల వేధింపులకు గురి చేశారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తాను పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. తన కుమార్తెకు న్యాయం జరగడం కోసం తాను వచ్చానన్నారు. అంతే కాని కేంద్ర మంత్రిగా, ఎంపీగా పోలీస్ స్టేషన్‌కు రాలేదన్నారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి చురకలు
ఇక ఈ ఘటనపై డీఎస్పీ కుషాంత్ పింగ్డే మాట్లాడుతూ.. ఈ జాతరలో పలువురు యువతల పట్ల ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. ఆ క్రమంలో వారిని భద్రతా సిబ్బంది వారించే ప్రయత్నం చేశారని పేర్కొ్నారు. ఆ క్రమంలో వారి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుందని వివరించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Also Read: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..
ఈ ఘటనలో ఆకతాయిలపై పలు సెక్షన్ల కింద వివిధ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఆయుధాన్ని ఇచ్చినట్లు అయిందన్నారు. అదీకాక రాష్ట్రంలో మంత్రుల కుటుంబాలు సురక్షితంగా లేనప్పుడు సామాన్య ప్రజల భద్రత ఎలా ఉంటుందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది
ఇక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే.. తన పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి భారీగా తరలి వెళ్లారు. రావెర్ నుంచి మూడు సార్లు ఖడ్సే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో మహిళపై నేరాల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో చట్టం అంటే భయం లేకుండా పోయిందన్నారు. వేధింపులకు గురైన మహిళలు బయటకు వచ్చి చెప్పేందుకు జంకుతున్నారన్నారు. అందుకే వాళ్లు నిశ్శబ్దంగా ఉంటున్నారన్ని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ఘటనపై చర్యలు తీసుకోవాలని సీఎంను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు.
For National News And Telugu News