SLBC Incident: ఎస్ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు
ABN , Publish Date - Mar 02 , 2025 | 08:28 PM
SLBC Incident: ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆపరేషన్ కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని గుర్తు చేశారు. ఈ పనులు చేపట్టిన సంస్థకు గత ప్రభుత్వం.. బిల్లులు సైతం చెల్లించ లేదన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్, మార్చి 02: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటన కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. ఈ ఘటన ఓ విపత్తు.. ఓ ప్రమాదమని ఆయన అభివర్ణించారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనను ఆయన పరిశీలించారు. ఆ క్రమంలో టన్నెల్‌లోకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులను ఆయన ఆరా తీశారు. అలాగే సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ కొనసాగాలన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదని ప్రతిపక్షాలను ఆయన హితవు పలికారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని గుర్తు చేశారు. అంతేకాదు.. ఈ పనులు చేపట్టిన సంస్థకు గత ప్రభుత్వం.. బిల్లులు సైతం చెల్లించలేదని తెలిపారు. పనులు చేస్తున్న సంస్థ బిల్లులు చెల్లించలేదని.. దీంతో విద్యుత్ సరఫరా కూడా ఆపేశారన్నారు.
Also Read: ఏపీలో కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పో.. ఎక్కడంటే..
అలాగే బోరింగ్ మిషన్‌కు విడిభాగాలు కూడా సమకూర్చలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పనులు జరుగుతోండగా.. అనుకోకుండా జరిగిన ప్రమాదం ఇదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. టన్నెల్‌లో బాధితులను రక్షించే పని కొలిక్కిరావడానికి మరో 2, 3 రోజులు పడుతుందన్నారు. కన్వేయర్ బెల్ట్ పని చేయక పోవడంతో.. మట్టి తరలించడం ఇబ్బందిగా మారిందన్నారు.
Also Read: కుమార్తె కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేంద్ర మంత్రి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని.. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని.. అయితే ఈ ప్రమాద ఘటన స్థలికి వెళ్తామంటే నాటి ప్రభుత్వం అనుమతించ లేదన్నారు. పనులు చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి చురకలు
మరోవైపు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటన చోటు చేసుకుని నేటికి 8 రోజులు అయింది. ఈ ఘటన స్థలానికి వెళ్లాడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఇన్ని రోజుల సమయం పట్టిందంటూ ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పైవిధంగా స్పందించారు. అయితే ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఎప్పటికప్పుడు తాను సమీక్ష నిర్వహించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..
ఇంకోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీతోపాటు లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. సహాయక చర్యల కోసం కేంద్రం తన వంతు సహాయం అందిస్తుందన్నారు. ఆ ఘటన జరిగిన నాటి నుంచి సహాయక చర్యలు నేటికి కొనసాగుతోన్న సంగతి అందరికి తెలిసిందే.
For Telangana News And Telugu News