CM Revanth Reddy: సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తాం
ABN, Publish Date - Apr 28 , 2025 | 03:35 AM
నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తూ, శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శాంతి చర్చలకు వచ్చే మావోయిస్టులపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా, జీవన విలువపై దృష్టి సారించాలని చంద్రకుమార్ పేర్కొన్నారు
శాంతిభద్రతల అంశంగా పరిగణించం
శాంతి చర్చల కమిటీతో భేటీలో సీఎం
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని, శాంతిభద్రతల అంశంగా పరిగణించబోదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని, కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరుతూ.. శాంతిచర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, వైస్ చైర్మన్లు జంపన్న అలియాస్ జి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, నేతలు ఆదివారం సాయంత్రం సీఎంను కలిశారు. పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు అందించారు. దీనిపై మంత్రులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటానని రేవంత్ చెప్పా రు.
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, దీనిపై ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, నక్సలైట్ల వైపు నుంచి ఎలాంటి హింసాత్మక చర్యలూ లేనంతవరకూ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఆయన తెలిపినట్టు సమాచారం. కాగా, మావోయిస్టులైనా, పోలీసులైనా, గిరిజనులు, ఆదివాసీలు, ఇలా ఎవరైనా.. ప్రాణం విలువ గొప్పదని, ప్రాణం పోతే తీసుకురాలేమని.. ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేయాలని.. సీఎంను కోరినట్టు చంద్రకుమార్ తెలిపారు. తమ విజ్ఞప్తులకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News
Updated Date - Apr 28 , 2025 | 03:35 AM