ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: కొందరు బీజేపీ సీనియర్లతో కేసీఆర్‌కు సంబంధాలు

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:48 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, కొందరు బీజేపీ సీనియర్‌ నాయకులతో కేసీఆర్‌కు సంబంధాలున్నాయని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

  • ఆ కారణంగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించారు

  • గత ఎన్నికల్లో కేసీఆర్‌ చెప్పిన వారే బీజేపీ అభ్యర్థులు: మహేశ్‌ గౌడ్‌

కొత్తగూడెం, మే 31 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, కొందరు బీజేపీ సీనియర్‌ నాయకులతో కేసీఆర్‌కు సంబంధాలున్నాయని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఆ సంబంధాల కారణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించారన్నారు. రేపో.. మాపో.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని గురుకుల పాఠశాల ఆవరణలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ గిరిజన కాంగ్రెస్‌ సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


అనంతరం విలేకరులతో మహేశ్‌ గౌడ్‌ మాట్లాడారు. ‘బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చెప్పినట్టే గత ఎన్నికల్లో కేసీఆర్‌ చెప్పినట్టుగానే బీజేపీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీకి తెలంగాణలో పునాదులు లేవు.. ఆ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం కలే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పార్టీ బలోపేతమవుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్‌ 90 సీట్లు గెలుచుకుంటుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. ఒక్కటేనని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. బండి సంజయ్‌ మాటలను ప్రజలు నమ్మడం లేదని, ఆయన ఇంకా యువ మోర్చా నాయకుడిలా మాట్లాడటం సరికాదన్నారు.


అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే లక్ష్యం: కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లోని వార్విక్‌ యూనివర్సిటీలో ప్రాగ్మటిక్‌ డిజైన్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (పీడీఎ్‌సఎల్‌) నాలెడ్జ్‌ సెంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలందించడం గర్వకారణం అన్నారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దొరకాలని, అందుకోసం సర్వశక్తులు ఉపయోగిస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:48 AM