ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు నిర్లక్ష్యం

ABN, Publish Date - May 16 , 2025 | 03:41 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత ధోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

  • రూ.8,000 కోట్లకు చేరిన బకాయిలు

  • ప్రమాదంలో లక్షల మంది విద్యార్థుల భవితవ్యం

  • తక్షణం చెల్లించండి.. సీఎంకు బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత ధోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు రూ.8,000 కోట్లకు పెరిగిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణం చెల్లించాలంటూ గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇకపై నిర్ణీత కాల పట్టిక ప్రకారం వాయిదాల్లేకుండా చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొందన్న బండి సంజయ్‌.. వేల సంఖ్యలో కాలేజీలు అప్పులతో మూత పడుతున్నాయని గుర్తు చేశారు.


కోర్సులు పూర్తిచేసిన పేద విద్యార్థులు సర్టిఫికెట్లు పొందక.. ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేక.. ఉన్నత విద్యనభ్యసించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలకూ విద్యార్థులకు మధ్య జరిగిన గొడవలు పోలీస్‌ స్టేషన్ల వరకూ వెళుతున్నా పట్టించుకోరా? అని రాష్ట్ర సర్కారును నిలదీశారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఓటీఎస్‌ కింద సెటిల్‌ చేసి, ఇక నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో జేఎన్‌టీయూలోనూ, అసెంబ్లీలోనూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు’ అని బండి సంజయ్‌ గుర్తు చేశారు. తక్షణం ఫీజు బకాయిలు చెల్లించకపోతే, తదుపరి పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆ లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:41 AM