ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Social media: వయసుతో సంబంధం లేకుండా.. అందరూ సోషల్‌ మీడియాకు బానిసలే..

ABN, Publish Date - Dec 28 , 2025 | 01:04 PM

2025లో ప్రపంచవ్యాప్తంగా 541 కోట్ల మంది సోషల్‌ మీడియాను ఉపయోగించారు. ప్రపంచ జనాభాలో ఇది 65.7 శాతంగా ఉంది. ఏటా 24 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్‌ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.

- ఇదీ లెక్క!

సోషల్‌మీడియా చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరి జీవితంలో భాగంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ సోషల్‌ మీడియాకు బానిసలే. అందుకే ప్రతీ ఏటా వినియోగదారుల సంఖ్య రెట్టింపవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్న వారి గణాంకాలను చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే...

- 2025లో ప్రపంచవ్యాప్తంగా 541 కోట్ల మంది సోషల్‌ మీడియాను ఉపయోగించారు. ప్రపంచ జనాభాలో ఇది 65.7 శాతంగా ఉంది. ఏటా 24 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్‌ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.

- సోషల్‌ మీడియాపై ఒక వ్యక్తి రోజూ వెచ్చిస్తున్న సమయం సగటున 143 నిమిషాలు. అంటే 2 గంటల 23 నిమిషాలు.

- సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వాటిల్లో ఫేస్‌బుక్‌ అగ్రస్థానంలో ఉంది. ఫేస్‌బుక్‌ని చూస్తున్న వారి సంఖ్య నెలకు సగటున 307 కోట్లుగా ఉంది. యూట్యూబ్‌ చూస్తున్న వారు 205 కోట్లు ఉంటే, ఇన్‌స్టాని వాడుతున్న వారి సంఖ్య 200 కోట్లుగా ఉంది.

- ఫేస్‌బుక్‌ని రోజూ ఉపయోగించే వారి సంఖ్య 201 కోట్లు ఉంటే, యూట్యూబ్‌ డైలీ వీక్షకుల సంఖ్య 12 కోట్లుగా ఉంది.

- 98 శాతం మంది మొబైల్‌ ఫోన్ల నుంచే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని యాక్సెస్‌ చేస్తున్నారు.

- నెలకు 61 కోట్ల మంది యూజర్లు ఎక్స్‌(ట్విటర్‌)ను వాడుతున్నారు. వార్తలు, పాలిటిక్స్‌, రియల్‌ టైమ్‌ కన్వర్సేషన్‌ కోసం ‘ఎక్స్‌’ను ఎక్కువగా వాడుతున్నారు.

- వాట్సప్‌ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య 200 కోట్లకు పైనే ఉంది. లాటిన్‌ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో వాట్సప్‌ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రైవేటు, గ్రూప్‌ కమ్యూనికేషన్‌ కోసం వాట్సప్‌ని అధికంగా వాడుతున్నారు.

వయసు ఆధారంగా సోషల్‌ మీడియాను చూస్తున్నవారి గణాంకాలివి...

- మిలీనియల్స్‌ (27-42) సుమారు 6.85 కోట్లు- ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా, వాట్సప్‌

- జెన్‌ జెడ్‌ (11-26) సుమారు 5.64 కోట్లు - ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌, టిక్‌టాక్‌

- జెన్‌ ఎక్స్‌ (43-58) సుమారు 5.2 కోట్లు - ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌

- బేబీ బూమర్స్‌ (59-77) సుమారు 3.7 కోట్లు - ఫేస్‌బుక్‌, మెసేజింగ్‌ యాప్స్‌

ఈ వార్తలు కూడా చదవండి..

బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!

ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2025 | 01:33 PM